హోమ్ /వార్తలు /సినిమా /

Rhea Chakraborty: నన్ను నమ్మి తీరాల్సిందే.. నేను ఏలాంటి తప్పు చెయ్యలేదంటున్న రియా చక్రవర్తి?

Rhea Chakraborty: నన్ను నమ్మి తీరాల్సిందే.. నేను ఏలాంటి తప్పు చెయ్యలేదంటున్న రియా చక్రవర్తి?

Rhea Chakraborty

Rhea Chakraborty

Rhea Chakraborty: బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు బాగా మారుమ్రోగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో తన పేరు బయట పడగా ఎన్ సీ బీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Rhea Chakraborty: బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు బాగా మారుమ్రోగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కేసులో తన పేరు బయట పడగా ఎన్ సీ బీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు మరో తొమ్మిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియా వేదిక ద్వారా రియా చక్రవర్తి ఓ పోస్టు పెట్టగా ప్రస్తుతం అది వైరల్ గా మారింది.

గత ఏడాది జూన్ 14 న కరోనా సమయంలో ముంబైలో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సుశాంత్ సింగ్.. ఎంతోమంది అభిమానులను, సినీ ఇండస్ట్రీ వాళ్లను మూగబోయేలా చేశాడు. ఇప్పటికీ ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అభిమానులు. ఎంఎస్ ధోని, చిచోరే సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో కూడా నటించగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

ఇక ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో కూడా సుశాంత్ అభిమానులు ఆయన పేరుతో ఎంతో మంది పేదవాళ్లకు సుశాంత్ కా కిచెన్ పేరుతో నిత్యావసరాలను కూడా అందిస్తున్నారు. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం సంవత్సరం కావడానికి వస్తున్న నేపథ్యంలో తాజాగా రియా చక్రవర్తి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించగా.. అందులో ' ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటే అంత గొప్ప బలం చేకూరుతుందని, ఈ విషయం పట్ల మీరు నన్ను నమ్మి తీరాల్సింది అంటూ.. అక్కడే ఉండు, ప్రేమతో రియా' అని తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. సుశాంత్ అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Bollywood, Rhea Chakraborty, Rhea Chakraborty Instagram Post on SSR, Rhea Chakraborty latest SSR News, Rhea Cryptic Post On SSR, Rhea Shares Rheality, Social Media, Sushant Singh Rajput, రియా చక్రవర్తి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

ఉత్తమ కథలు