Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో సంచలన ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సింగ్‌కు మళ్లీ షాక్

డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు శోవి‌క్‌కు కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది.

news18-telugu
Updated: September 15, 2020, 6:50 AM IST
Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో సంచలన ట్విస్ట్.. రకుల్ ప్రీత్ సింగ్‌కు మళ్లీ షాక్
రకుల్ ప్రీత్ సింగ్ (Image: Instagram)
  • Share this:
డ్రగ్స్ కేసు వ్యవహారం బాలీవుడ్‌లో ప్రకంపనలు రేపుతోంది. సుశాంత్ మృతి కేసు విచారణ క్రమంలో బయపడిన డ్రగ్స్ లింకులు ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఈ కేసులో మరో సంచలన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. NCB విచారణలో రియా చక్రవర్తి నిజంగానే కొందరి పేర్లను బయటపెట్టింది. సారా అలీఖాన్, రకుల్ ప్రీత్సింగ్ పేర్లను రియా చక్రవర్తి వెల్లడించినట్లు మాదకద్రవ్యాల నిరోధక శాఖ (NCB) సోమవారం అధికారికంగా ప్రకటించింది. వారితో పాటు డిజైనర్ సిమోనె ఖంబట్టా పేరును కూడా చెప్పినట్లు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. ఐతే ఈ కేసులో వారికి ఎలాంటి సమన్లు జారీ చేయలేదని.. వారి విషయంలో ఎలా ముందుకెళ్లేది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.

డ్రగ్స్ కేసులో 25 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీలతో లిస్ట్ సిద్ధం చేశారా? అన్ని రిపోర్టర్లు ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రియా చక్రవర్తి విచారణ మాత్రం కొనసాగుతోందని చెప్పారు. ఐతే బాలీవుడ్ కేసులో సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌తో పాటు 25 పేర్లను రియా చక్రవర్తి వెల్లడించిందని మొదట ప్రచారం జరిగింది. ఐతే అలాంటిదేమీ లేదని.. అదంతా ఊహాగానాలేనని ఆ తర్వాత వార్తలు వచ్చాయి. దాంతో రకుల్‌కు చాలా మంది సెలబ్రిటీలు అండగా నిలిచారు. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా #NoRakul #NoSara అంటూ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌కు సారీ చెప్పారు. వీళ్లిద్దరికి సమంత కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా మద్దతు తెలిపింది. కానీ అంతలోనే ఎన్సీబీ అధికారిక ప్రకటన చేస్తూ.. సారా, రకుల్ పేర్లను రియా వెల్లడించిందని తెలపడంతో మళ్లీ దుమారం రేగుతోంది.

శ్రీ రెడ్డి, రకుల్ ప్రీత్ (File/Photo)

మరోవైపు డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. శనివారం ముంబయితో పాటు గోవాలో పలు చోట్ల సోదాలు నిర్వహించి మరో ఆరుగురిని అరెస్టు చేశారు. బాంద్రాకు చెందిన కరంజీత్‌ సింగ్‌ ఆనంద్‌ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సిండికేట్‌లో అతడు భాగస్వామిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు శోవి‌క్‌కు కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడిషియల్ రిమాండ్‌ విధించింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు సెషన్స్ కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ముంబైలోని బైకుల్లో జైలో ఉన్నారు రియా చక్రవర్తి.

సుశాంత్ మృతి కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇందులో డ్రగ్స్ వ్యవహారం బయటపడడంతో ఆ కోణాన్ని ఎన్సీబీ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో లింకులను జోడిస్తూ వెళ్లిన ఎన్‌సీబీ మొదట డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి కొంతమందిని విచారించి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత రియాను కూడా అరెస్ట్ చేశారు. ఇక సుశాంత్ ఖాతాల్లోని డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: September 15, 2020, 6:47 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading