'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని నిషేధించాలంటూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సినిమా ద్వారా వర్మ ఎన్టీఆర్ జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నా... ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్‌గా తీస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వర్మ రిలీజ్ చేసిన వెన్నుపోటు సాంగ్, తాజాగా బాహుబలి వెన్నుపోటు దృశ్యాన్ని మార్ఫింగ్ చేసి పెట్టిన ట్విట్టర్ ఫొటో వంటివి చంద్రబాబు టార్గెట్ ఉన్నాయంటున్నారు నెటిజన్లు. వర్మ మాత్రం తాను ఏం చూపించాలనుకున్నానో అదే చూపిస్తాననీ, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి వైపు నుంచీ సినిమా కోణం ఉంటుందని చెబుతున్నారు. వివాదాలకు భయపడేది లేదంటున్న ఆయన... అలా భయపడేవాణ్నే అయితే అసలీ సినిమా తీసేవాణ్నే కాదంటున్నారు. అందువల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.
These faces are vaguely reminding of two people I know ..can u please help me with my memory pic.twitter.com/Hgqb3tKNB5
— Ram Gopal Varma (@RGVzoomin) January 19, 2019
లక్ష్మీస్ ఎన్టీఆర్ ద్వారా ఇప్పటికే వర్మ కావాల్సినంత హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఇంకా టీజర్, ట్రైలర్ రానేలేదు. అవి కూడా రిలీజైతే... సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఐతే, హైకోర్టు ఎలా స్పందిస్తుందన్నది చర్చనీయాంశమైంది. సాధారణంగా వివాదాస్పద సినిమాలపై సెన్సార్ బోర్డ్ నిర్ణయాన్ని కోర్టులు స్వాగతిస్తుంటాయి. అందువల్ల వర్మ సినిమాకి హైకోర్టు నుంచీ ఎలాంటి సమస్యా ఉండదంటున్నారు కొందరు టాలీవుడ్ ప్రముఖులు. అభ్యంతరాలుంటే వాటి సంగతి సెన్సార్ బోర్డ్ చూసుకుంటుందని చెబుతున్నారు.
Video: ట్యాంకర్‌కు ఎదురెళ్లిన దూడ... సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: High Court, Ram Gopal Varma