హోమ్ /వార్తలు /సినిమా /

‘బాహుబలి’,అర్జున్ రెడ్డి రికార్డును బీట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా..

‘బాహుబలి’,అర్జున్ రెడ్డి రికార్డును బీట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్.. ఇంతకీ ఏ విషయంలో తెలుసా..

బాహుబలి,అర్జున్ రెడ్డిలను బీట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్

బాహుబలి,అర్జున్ రెడ్డిలను బీట్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్

సార్వత్రిక ఎన్నికల ముంగట ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైంది. తాజాగా ఈ మూవీ బాహుబలి,అర్జున్ రెడ్డి రికార్డులను బీట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

సార్వత్రిక ఎన్నికల ముంగట ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైంది. ఏపీలో ఈసినిమా విడుదలకు అక్కడి హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఈ సినిమా విడుదల కాలేకపోయింది. దాంతో వర్మ..ఈ సినిమాను తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసాడు.ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.4 కోట్ల గ్రాస్..రూ.2 కోట్ల షేర్ వచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఒక రకంగా చూస్తే అంతా కొత్త వాళ్లతో తెరకెక్కించిన ఈ సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ రావడం విశేషం. తాజాగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మరో రికార్డు‌‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా IMDB (ఇండియన్ మూవీ డేటా బేస్) లో బాహుబలి, అర్జున్ రెడ్డి సినిమాలను క్రాస్ చేసింది. ఈ సినిమాకు IMDB లిస్టులో 53 శాతం మంది ఇష్టపడ్డ సినిమాగా రికార్డులకు ఎక్కింది.

సార్వత్రిక ఎన్నికల ముంగట ఎన్నో బాలారిష్టాలు ఎదుర్కొని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలైంది. తాజాగా ఈ మూవీ బాహుబలి,అర్జున్ రెడ్డి రికార్డులను బీట్ చేసింది. వివరాల్లోకి వెళితే..
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

అదే బాహుబలి సినిమాను ఇష్టపడుతున్నట్టు 3.4 శాతం మందే చెప్పారు. మరోవైపు విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు 3.4 శాతం ఓట్లు రావడం విశేషం. ఇక IMDB లిస్టులో 8.3 ఓట్లతో రామ్ చరణ్ ఆల్ టైమ్ డిజాస్టర్ ..‘వినయ విధేయ రామ’ రెండో ప్లేస్‌లో నిలవడం విశేషం. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ‘గీతా గోవిందం’ 5.2 ఓట్లతో మూడో ప్లేస్‌లో నిలిచింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ స్టోరీ విషయానికొస్తే..  1989లో ఎన్టీఆర్ ఓటమిపాలైన తర్వాత లక్ష్మీ పార్వతి అన్నగారి జీవితంలో ప్రవేశించిన తర్వాత జరిగిన సంఘటన నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు రామ్ గోపాల్ వర్మ.

First published:

Tags: Arjun Reddy, Bahubali, Box Office Collections, Lakshmis NTR, Lakshmis NTR Movie Review, NTR, NTR Biopic, Prabhas, Ram Gopal Varma, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

ఉత్తమ కథలు