• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RGV VS PAWAN KALYAN RAM GOPAL VARMA SETIRICAL TWEET ON PAWAN KALYAN COVID 19 AND HE SAID P K FANS TO KILL CORONA VIRUS TA

RGV Vs Pawan Kayan Fans: మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ఓ రేంజ్‌లో..

RGV Vs Pawan Kayan Fans: మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ఓ రేంజ్‌లో..

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై సెటైర్లు వేసిన ఆర్జీవి (Twitter/Photo)

RGV Vs Pawan Kayan Fans: మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ఓ రేంజ్‌లో..

  • Share this:
    RGV Vs Pawan Kayan Fans: మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సారి ఓ రేంజ్‌లో.. రామ్ గోపాల్ వర్మ.. ఎపుడు ఎవరిని ఏ రేంజ్‌లో సెటైర్లు వేస్తాడో చెప్పడం కొంచెం కష్టమే. తాజాగా ఆర్జీవి.. పవన్ కళ్యాణ్‌కు కరోనా సోకడంతో మరోసారి సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ అభిమానులకు రెచ్చగెట్టేలా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. . గ‌త నెల రోజులుగా దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే అక్షయ్ కుమార్, గోవిందా సహా పలువురు సెలబ్రిటీలో కరోనా బారిన పడ్డారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా తెలియజేసింది. డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చికిత్స తీసుకుంటున్న ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసారు.

    ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ.. పవన్ కళ్యాణ్‌కు  కరోనా సోకింది. ఆయన అభిమానులను ఉద్దేశిస్తూ.. హే పీకే ఫ్యాన్స్.. కరోనా వైరస్‌ను పచ్చడి చేసి చంపేయండి అంటూ కాస్తా వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు. ఇపుడీ ట్వీట్ సోషల్  మీడియాలో వైరల్ అవుతోంది.


    మరోవైపు ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో థియేటర్స్, బార్లు, రెస్టారెంట్లు అన్నింటిని బంద్ చేసారు. కానీ బంగాల్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలను ఉత్తరాఖండ్‌లో ‘కుంభమేళా’లో లక్షలాది జనాలు పాల్గొనడంపై ఆర్జీవి తీవ్ర విమర్శలు గుప్పించారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    అగ్ర కథనాలు