• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RGV RELEASED A CONTROVERSIAL POSTER OF POWER STAR MOVIE AND PAWAN SLAPPED TRIVIKRAM IN THAT PK

పవర్ స్టార్ ఆ దర్శకున్ని నిజంగానే కొట్టాడా.. ఏంటి వర్మ ఇది...?

పవర్ స్టార్ ఆ దర్శకున్ని నిజంగానే కొట్టాడా.. ఏంటి వర్మ ఇది...?

పవర్ స్టార్ సినిమా పోస్టర్ (pawan kalyan power star movie)

Power Star movie: వర్మ ఏం చేసినా కూడా చిరిగి చిరిగి చాటంత అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన సినిమాల గురించి ఎంత పట్టించుకోవద్దని అనుకున్నా..

  • Share this:
వర్మ ఏం చేసినా కూడా చిరిగి చిరిగి చాటంత అవుతుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. ఈయన సినిమాల గురించి ఎంత పట్టించుకోవద్దని అనుకున్నా కూడా పట్టించుకునేలా చేస్తుంటాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈయన పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ పోలిన వ్యక్తి హీరోగా నటిస్తున్నాడు. ఇది నేను రాసుకున్న కథ.. ఇందులో హీరోకు ఆవులు అంటే యిష్టం.. అమ్మాయిలతో ఉంటాడు అంటూ పిచ్చిపిచ్చి కబుర్లు అన్నీ చెప్తున్నాడు వర్మ.
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)

కానీ అది పవన్ కళ్యాణ్ పాత్ర అని అర్థమైపోతుంది. ఇక ఇప్పుడు మరో పాత్ర కూడా పరిచయం చేసాడు. అతనెవరో కాదు.. TS. అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ దర్శకుడిని పవన్ కళ్యాణ్ కొట్టినట్లు పోస్టర్ విడుదల చేసాడు వర్మ. ఇది చూసి లేనిపోని అనుమానాలు వస్తున్నాయి. ఆ మధ్య ఓ హీరోయిన్ విషయంలో పవన్, త్రివిక్రమ్ మధ్య గొడవ జరిగిందనే వార్తలు అయితే జోరుగానే వినిపించాయి. ఇప్పుడు వర్మ దాన్ని బేస్ చేసుకుని ఈ పోస్టర్ విడుదల చేసాడా అనేది ఆసక్తికరంగా మారింది.
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)
వర్మ పవర్ స్టార్ ఫస్ట్ లుక్ (Power Star movie/Twitter)

తన సినిమాలో TS అనే నటుడు ఉంటాడని వర్మ ఇదివరకే చెప్పాడు. అతడే త్రివిక్రమ్ అని నెటిజన్లు చెప్తున్నారు. పైగా ఆయన వేషధారణ కూడా అలాగే ఉంది. ఇప్పుడు ఈయన రిలీజ్ చేసిన పోస్టర్ చూసిన తర్వాత నిజంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పవర్ స్టార్ కొట్టాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలేంటి ఈ కన్ఫ్యూజన్.. వర్మ ఎందుకిలా చేస్తున్నావ్ అంటూ అడుగుతున్నారు. ఏది పడితే అది అలా విడుదల చేసి ఎందుకు పవన్ కళ్యాణ్ సహనాన్ని పరీక్షిస్తున్నావ్ అంటూ అభిమానులు మండి పడుతున్నారు. మరి చూడాలిక.. ఈ రచ్చ ఇంకెంత దూరం వెళ్తుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: