RGV on Covid Files : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. దాంతో పాటు ఎపుడు ఎలాంటి సినిమాను అనౌన్స్ చేస్తాడనేది కూడా ఎవరు ఊహించరు. తాజాగా ఈయన మరోసారి అదే చేసాడు. కోవిడ్ ఫైల్స్ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేసాడు. వర్మ విషయానికొస్తే.. మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడం దాన్ని చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. గత కొన్నేళ్లు రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి.
ప్రస్తుతం ‘డేంజరస్’ తో పాటు ‘లడ్‌కీ’ వంటి బీ గ్రేడ్ వంటి సినిమాలతో వార్తల్లో నిలిచారు. తాజాగా ఈయన ‘కోవిడ్ ఫైల్స్’ పేరుతో ఓ సినిమాను అనౌన్స్ చేశారు. కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఎంతో మంది చనిపోయిన విషయాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
COVID FILES film will expose the incompetence, carelesssness and corruption in the governance which caused the terrible deaths of lakhs of people pic.twitter.com/N6WVLI4W0T
— Ram Gopal Varma (@RGVzoomin) July 21, 2022
అప్పట్లో యూపీలో కోవిడ్ మృత దేహాలను గంగ నదిలో విసిరేసిన దృష్యాలు సంచలనం రేపాయి. వీటిపై ప్రభుత్వం మాత్రం తమను విమర్శల పాలు చేయడానికే ప్రతిపక్షాలు, మీడియా కావాలనే ఇదంత చేసాయని పేర్కొన్నాయి. ఏది ఏమైనా.. కోవిడ్ కారణంగా చాలా మంది కన్నుమూసిన సంగతి తెలిసిందే కదా. మరి అదే ప్రభుత్వం కోవిడ్ టీకాలను తీసుకొచ్చి భారతీయులు ప్రాణాలతో పాటు ప్రపంచ దేశాలకు టీకాలను ఇచ్చి ప్రాణభిక్ష అందించిన విషయాన్ని కూడా మరవ కూడదు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తెరెక్కించబోయే ‘కోవిడ్ ఫైల్స్’ ఎవరిని టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తాడనేది చూడాలి. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వాన్నా.. లేకుంటే యూపీలోని యోగీ సర్కారును టార్గెట్ చేస్తాడా అనేది చూడాలి.
Unmarried Actress: వయసు 50కు దగ్గరగా ఉన్న.. మ్యారేజ్‌కు దూరంగా ఉన్న హీరోయిన్లు వీళ్లే..
ఆర్జీవి.. ఒక సంఘటన నేపథ్యంలో సినిమాలను తెరకెక్కించడమే కాకుండా.. దాన్ని ఆసక్తికరంగా మలచడంలో ఆయన స్టైలే వేరు. గతంలో 26/11 ఎటాక్, రక్త చరిత్ర, సర్కారు, కంపెనీ ఇలా చెప్పుకుంటూ పోతే రామ్ గోపాల్ వర్మ.. నిజ జీవిత సంఘటలన ఆధారంగా తెరకెక్కించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ యేడాది ‘ది కశ్మీర్ ఫైల్స్’ అంటూ 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన పండిత్స్ ఊచకోతపై తెరకెక్కిన సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇపుడు అదే దర్శకుడు.. CAAకు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ఇపుడు ‘ది దిల్లీ ఫైల్స్’ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.
ఇపుడు అదే తరహాలో ‘ కోవిడ్ ఫైల్స్’ పేరుతో తన సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేసాడు ఆర్జీవి. మరి రామ్ గోపాల్ వర్మ గతంలో ఎన్నో సినిమాలను ప్రకటించారు. ఆ తర్వాత వాటి ఊసు కూడా ఉండదు. మరి ఇపుడు ప్రకటించిన ‘కోవిడ్ ఫైల్స్’ సినిమా నిజంగానే తెరకెక్కిస్తాడా ? లేకుండా ప్రకటనలకే పరిమితమవుతాడా ? అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Covid Files, Ram Gopal Varma, RGV, Tollywood