RGV RAM GOPAL VARMA AGAIN CONTROVERSIAL TWEET ON WOMEN DAY TA
Ram Gopal Varma: మహిళ దినోత్సవం రోజున ఆర్జీవి మార్క్ వివాదాస్పద ట్వీట్..
రామ్ గోపాల్ వర్మ (RGV)
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చెప్పడం కాస్త కష్టమే. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చకోవాలి. తాజాగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా వర్మ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Ram Gopal Varma | రామ్ గోపాల్ వర్మ ఎపుడు ఎవరిపై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చెప్పడం కాస్త కష్టమే. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచాడు. ఆ తర్వాత వివాదాలకు కేంద్ర బిందువు అయ్యాడు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆర్జీవి నిజ జీవిత వివాదాస్పద సంఘటనలకు సంబంధించిన స్టోరీలు తెరకెక్కిస్తున్న అవేవి వర్కౌట్ కావడం లేదు. ఎప్పుడు ఏదో ఒక సంఘటనపై తనదైన శైలిల్ పంచ్‌లు వేస్తూ ఉంటాడు.రీసెంట్గా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి .. తన ట్విట్టర్లో తన పెంపుడు కుక్కకు కుడి చేత్తో తినిపిస్తూ.. ఎడమ చేత్తో తను తింటున్న వీడియోను పోస్ట్ చేసింది. కుక్కపై ఆమెకున్న ప్రేమకు ఇది నిదర్శనం. ఆమెను అంతర్జాతీయ కుక్కల మేయర్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా ట్వీట్ చేసాడు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ వివాదాస్పద ట్వీట్ చేసాడు. మహిళలు ప్రతి రోజు సంతోషంగా ఉండాలని నేను కోరకుంటున్నాను. అందుకే వారికి ఉమెన్స్ డే విషెస్ చెప్పనని పేర్కొన్నాడు.
I want women to be happy each and every day ..So I won’t wish them Happy Women’s Day
మొత్తంగా ఆర్జీవి.. మహిళలకు కూడా పురుషులతో సమానంగా ప్రతి రోజు ఉండాలని కోరకున్నాడని ఆయన అభిమానులు వ్యాఖ్యానిస్తే.. ఇంకొందరు ఆర్జీవి అదో టైపు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా అంతర్జాతీ మహిళ దినోత్సవం సందర్భంగా ఆర్జీవి చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.