RGV ON CM KCR BIOPIC RAM GOPAL VARMA SENSATIONAL WORDS ABOUT TELANGANA CM KCR BIOPIC TA
RGV on KCR Biopic : కేసీఆర్ బయోపిక్ పై రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం..
కేసీఆర్ బయోపిక్ పై ఆర్జీవి వ్యాఖ్యలు (File/Photo)
RGV on KCR Biopic : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. తాజాగా ఈయన కేసీఆర్ బయోపిక్ పై స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు.
RGV on KCR Biopic : దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఎపుడు ఎలా బిహేవ్ చేస్తాడో చెప్పడం కష్టం. మనసులో ఏది ఉందో దాన్ని నిర్మోహమాటంగా మాట్లాడం దాన్ని చేసేయడం ఆర్జీవి మార్క్ స్టైల్. గత కొన్నేళ్లు రామ్ గోపాల్ వర్మ తన చేతలతో వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేయించుకున్నారు. వర్మ ఏం చేసినా.. సంచలనమే. ఏమి చేయకుండా కామ్‌గా ఉన్నా కూడా ఏదో సంచలనానికి తెరలేపుతున్నట్టే అర్ధం.తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం వర్మను చూసే నేర్చుకోవాలి. ఒకప్పుడు తన సినిమాలతో సంచలనాలకు మారు పేరుగా నిలిచిన ఈయన ఇపుడు రొటిన్ చెత్త సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడు ఏదో ఇష్యూ మీద కాంట్రవర్సీ ట్వీట్స్ చేస్తూ వార్తల్లో నిలవడం రామ్ గోపాల్ వర్మ శైలి. తాజాగా ఈయన తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీ తీస్తున్నట్టు చెప్పారు.
గతంలో కూడా టైగర్ కేసీఆర్ అంటూ ఓ బయోపిక్‌ను అనౌన్స్ చేసినా.. ఆ తర్వాత కామ్ అయిపోయారు. తాజాగా ఈయన దర్శకత్వం వహించిన ‘డేంజరస్’ మూవీ ప్రమోషన్లో భాగంగా మరోసారి సీఎం కేసీఆర్ బయోపిక్ మూవీపై తన మనసులతో మాట బయట పెట్టారు.
ఇక పొలిటికల్ బయోపిక్స్‌ను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మను మించిన తోపు దర్శకుడు లేరు. ముఖ్యంగా అండర్ వరల్డ్ డాన్ చిత్రాలకు సంబంధించిన బయోపిక్స్‌ను తీయడంలో వర్మను మించినోడు లేడంటూ ఆయన ప్రత్యర్ధులు అంటుంటారు. గతంలో రామ్ గోపాల్ వర్మ ఏదైనా సంఘటన జరినపుడు దానికి సంబంధించిన చరిత్రను సినిమా తీస్తున్నట్టు ప్రకటించడం ఆయన అలవాటు. అంతేకాదు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అటెన్షన్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఇష్టం ఉంటే ఆ సినిమాను తెరకెక్కిస్తారు. లేకపోతే అంతే సంగతులు.
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వర్మ బయోపిక్ (File/Photo)
ఇక సార్వత్రిక ఎన్నికల ముందు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, ఆ తర్వాత ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలతో సంచలనం రేపారు. ముందుగా ఈ సినిమాకు ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అంటూ కులాన్ని సంబోదిస్తూ సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత టైటిల్ ఛేంజ్ చేసి రిలీజ్ చేస్తే అంతగా వర్కౌట్ కాలేదు.ఇక అప్పట్లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. అంతేకాదు కేసీఆర్ తన పోరాటాన్ని ఆంధ్ర ప్రజలపై కాకుండా.. తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచిన, మోసం చేసిన ఆంధ్రా నాయకులపైనే ఈ చిత్రం ఉంటుందని వర్మ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే కదా.. కేసీఆర్‌కు తెలుగు ప్రజలంటే ప్రేమ ఉంది. ఆయన పోరాట మంతా తెలంగాణ ప్రజలను వెన్నుపోటు పొడిచిన ఆంధ్రా నాయకులపైనే అంటూ వివరణ ఇచ్చాడు.
ఇక ఈ సినిమాకు అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ పాత్ర కోసం రంగస్థల నటుడిని తీసుకొచ్చినట్టు ..కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై ‘ఉద్యమ సింహం’తో పాటు శ్రీకాంత్ హీరోగా ‘తెలంగాణ దేవుడు’ టైటిల్స్‌తో సినిమాలు కూడా తెరకెక్కాయి. కానీ ఈ సినిమాలేవి ప్రేక్షకులను అలరించలేకపోయాయి. మరి రామ్ గోపాల్ వర్మ.. కేసీఆర్ బయోపిక్‌లోని ఏ యాంగిల్‌ను తీసుకొని తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. మరి చెప్పినట్టే.. ఆర్జీవి ఈసారైనా కేసీఆర్ బయోపిక్‌ను అనుకున్నట్టే తెరకెక్కిస్తారా లేకుండా పబ్లిసిటీ స్టంట్‌గా మిగిలిపోతుందా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.