Home /News /movies /

RGV KONDA MOVIE TRAILER RELEASED AND ITS REAL AND RUSTIC WITH REALISTIC INCIDENTS PK

RGV Konda trailer: ఆర్జీవీ ‘కొండా’ ట్రైలర్ విడుదల.. పేరు గుర్తుందిగా.. నా పేరు కొండా.. కొండా మురళి..

ఆర్జీవీ కొండా సినిమా ట్రైలర్

ఆర్జీవీ కొండా సినిమా ట్రైలర్

RGV Konda trailer: వర్మ (RGV Konda trailer) మరో బయోపిక్ తీస్తున్నాడు. తెలంగాణలో పేరు మోసిన కొండా కుటుంబంపై ఈయన సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో ఆదిత్ అరుణ్.. సురేఖ పాత్రలో ఐరా మోర్ నటిస్తున్నారు.

ఇంకా చదవండి ...
వర్మ మరో బయోపిక్ తీస్తున్నాడు. తెలంగాణలో పేరు మోసిన కొండా కుటుంబంపై ఈయన సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో ఆదిత్ అరుణ్.. సురేఖ పాత్రలో ఐరా మోర్ నటిస్తున్నారు. కనీ వినీ యెరుగని అసాధారణ పరిస్థితుల్లో, సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ శక్తులుగా మారుతారు.. అలా ఒక అసాధారణ శక్తిగా మారిన సాధారణ వ్యక్తే కొండా మురళి.. అంటూ ట్రైలర్ మొదలుపెట్టాడు వర్మ. కొండా లాంటి అసాధారణ శక్తికి, ఆదిపరా శక్తి లాంటి సురేఖ తోడైనప్పుడు ఆ శక్తులిద్దరిని చూసి ఓర్వలేక మనిషి రూపంలో ఉన్న కొందరు జంతువులు చేసిన క్షుద్ర మైన కుట్రలను, తిప్పికొడుతూ తెలంగాణలో చేసిన ఒక కురుక్షేత్ర యుద్దమే, మా కొండా చిత్రం అంటున్నాడు వర్మ.

ఇకపోతే ఒక మాదిరి రంగులో ఉండే నల్ల సుధాకర్ విషయానికొస్తే కొన్ని పరిస్థితుల నుండి కొందరు నాయకులు పుడుతారు.. కానీ పరిస్థితులను ఏర్పాటు చేసుకొని నాయకుడై ఒకే అమ్మకి, నాన్నకి పుట్టానని పదే పదే చెప్పుకుంటూ తిరిగే వాడే నల్ల సుధాకర్ అంటూ కారెక్టర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఆర్కే, భారతక్క గురించి చెప్తూ.. తెలంగాణలో ఒక్క సామెత ఉంది. 'పొట్టోన్ని పొడుగోడు కొడ్తే, పొడుగోన్ని పోశమ్మ కొట్టిందంటరు' ప్రజలను కాలరాస్తు బలిసిపోయిన నాయకులను, వాళ్ళకు అమ్ముడు పోయిన కొందరూ పోలీస్‌లను, పోచమ్మలా నరికేదందుకు పుట్టినోళ్ళే ఆర్కే, భారతక్క.

Ravi Teja Birthday: రవితేజ బర్త్ డే స్పెషల్.. 11 మంది దర్శకులను పరిచయం చేసిన మాస్ రాజా..


కార్ల్ మార్క్స్ చెప్పినట్టు విప్లవమనేది తుపాకీ తూటల్లో నుంచి కాదు, కొండా మురళి చెప్పినట్టు గుండెల్లోతుల్లోని బాధల నుంచి పుడుతుందని చెప్పాడు వర్మ. అందుకే మనిషిని అనగదొక్కే పరిస్థితి ఉన్నంత వరకు, విప్లవం అనే ఒక దైవసర్పం కాటేస్తూనే ఉంటుంది. పెత్తందారులకి ఎదురు పోరాడిన ఆ కొండా దంపతుల కథలు బెజవాడ దుర్గమ్మ, అనంతపురం సుంకాలమ్మని మించిన మైసమ్మ శాల్తులుగా నాకు అనిపించ బట్టే మీకు కనిపించ చెయ్యబోతున్నాను. ఈ నిజాలన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా కొండా చిత్రంలో కనబడతాయంటున్నాడు.


కొండా చిత్రం మొదటి ట్రైలర్ జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిమిషాలకి విడుదలైంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున అదే 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో, ఒక్క అత్యంత దారుణ హత్య ప్రయత్నం జరిగింది. మైసమ్మ దయ వల్ల కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్‌లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండిపోయాయి. ఆ బుల్లెట్‌లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ.. లాల్ సలాం.. అంటున్నాడు ఈయన. ట్రైలర్ అంతా ఆసక్తికరంగానే ఉంది. కొండా మురళి నక్సలైట్ ప్రయాణం నుంచి రాజకీయ ప్రయాణం వరకు చూపిస్తున్నాడు వర్మ.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Konda Movie, Ram Gopal Varma, RGV, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు