ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ నేడే..

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా విడుదలయ్యేది నేడే. పలు సీన్ల కట్‌తో యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు జారీ చేయడంతో ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది.

news18-telugu
Updated: December 12, 2019, 7:53 AM IST
ఆర్జీవీ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ నేడే..
అమ్మరాజ్యంలో కడపబిడ్డలు రిలీజ్ పోస్టర్ (Source: RGV Twitter)
  • Share this:
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా విడుదలయ్యేది నేడే. పలు సీన్ల కట్‌తో యూ/ఏ సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు జారీ చేయడంతో ఈ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. కాగా.. అంతకుముందు సినిమా విడుదలకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివాదస్పదమైన ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ఎలా అనుమతి ఇస్తుందని, అదేవిధంగా విడుదల ఆపాలంటూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా ఈ పిటిషన్లపై సెన్సార్‌ బోర్డు, చిత్ర యూనిట్‌ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ చిత్రంపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డు నిర్ణయం తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు చిత్ర విడుదలపై రివ్యూ కమిటీ, సెన్సార్‌ బోర్డుదే తుది నిర్ణయమని హైకోర్టు తెలిపింది. రివ్యూ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బుధవారం సాయంత్రం చిత్ర యూనిట్‌కు సెన్సార్‌ బోర్డు సభ్యులు సర్టిఫికేట్‌ను అందజేశారు.

కాగా, సినిమా విడుదలను ఆపాలనుకున్న వారికి దుర్వార్త అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. తన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందని తెలిపాడు. సెన్సార్ బోర్డుతోనూ అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, కేసులు కూడా ఓ కొలిక్కి వచ్చాయని, మీ చెత్త ఐడియాలతో సినిమాను అడ్డుకోవడానికి మగవాళ్లు, జోకర్లు ఉంటే రావాలని సవాల్ విసిరాడు. రాజ్యాంగం అందించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కును మాత్రం ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు చిత్రం రేపు విడుదల అవుతోందని పేర్కోన్నాడు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 12, 2019, 7:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading