HOME »NEWS »MOVIE »rgv d company official teaser released and here the review of it pk

RGV D COMPANY teaser: ‘D కంపెనీ’ టీజర్ విడుదల.. బాంబుల మోత.. తుపాకి తూటా..

RGV D COMPANY teaser: ‘D కంపెనీ’ టీజర్ విడుదల.. బాంబుల మోత.. తుపాకి తూటా..
ఆర్జీవీ డి కంపెనీ టీజర్ (RGV D Company teaser)

RGV D COMPANY teaser: రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నుంచి స్వాతిముత్యాలు ఎవరూ ఊహించరు. వచ్చేవన్నీ యాక్షన్ సినిమాలు.. లేదంటే రియలిస్టిక్ డ్రామాలు.. అవీ కాదంటే..

  • Share this:
రామ్ గోపాల్ వర్మ నుంచి వస్తున్న సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన నుంచి స్వాతిముత్యాలు ఎవరూ ఊహించరు. వచ్చేవన్నీ యాక్షన్ సినిమాలు.. లేదంటే రియలిస్టిక్ డ్రామాలు.. అవీ కాదంటే ఈ మధ్య పొర్న్ సినిమాల వైపు కూడా అడుగేస్తున్నాడు వర్మ. ఇప్పుడు కూడా మరో రియలిస్టిక్ డ్రామాతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో బయోపిక్స్ చేసిన వర్మ.. ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. అదే దావూద్ ఇబ్రహీం బయోపిక్ లాంటి సినిమా. అదే డి కంపెనీ. గతంలోనే దావూద్ కథతో కొన్ని సినిమాలు చేసాడు వర్మ. కానీ అందులో పేరు స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు ఆయన పేరు చెప్పి మరీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇప్పుడు విడుదల చేసారు. ఒకటి రెండు కాదు ఏకంగా 3.17 నిమిషాలు ఉంది ఈ టీజర్. ఈ రోజుల్లో ట్రైలర్ నిడివే 2 నిమిషాలు దాటడం లేదు కానీ వర్మ మాత్రం భిన్నం. ఏకంగా టీజర్‌కే మూడున్నర నిమిషాలు ఇచ్చాడు. అంత టీజర్ ఉన్నా కూడా ఒక్కటి కూడా వావ్ అనిపించే మూవెంట్ లేదు. కేవలం రక్తపాతం.. మర్డర్లు.. గొడవలు.. చంపుకోవడం తప్ప మరేం ఆసక్తికరంగా కనిపించలేదు. దావూద్ శకం ఎలా మొదలైంది అనేది ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని చేస్తున్న సినిమా ఇది. అందుకే కథను కూడా ముంబై 1980 అంటూ మొదలు పెట్టాడు వర్మ. ఇందులో తెలిసిన మొహాలు కూడా ఒక్కటీ కనిపించడం లేదు.

త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నాడు వర్మ. స్పార్క్ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డి కంపెనీలో వర్మ ఆస్థాన నటి నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తుంది. టీజర్ అయితే కచ్చితంగా అంత ఆసక్తికరంగా మాత్రం అనిపించడం లేదనేది అభిమానులు కూడా చెప్తున్న మాట. వర్మ నుంచి మేం కోరుకుంటున్నది ఇది కాదంటూ నెటిజన్లు టీజర్ కిందే కామెంట్ పెడుతున్నారు.
Published by:Praveen Kumar Vadla
First published:January 23, 2021, 18:23 IST