హోమ్ /వార్తలు /సినిమా /

Reyiki Veiyi Kallu Review: ‘రేయికి వేయికళ్లు’ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ..

Reyiki Veiyi Kallu Review: ‘రేయికి వేయికళ్లు’ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ..

రేయికి వేయి కళ్లు మూవీ రివ్యూ (Twitter/Photo)

రేయికి వేయి కళ్లు మూవీ రివ్యూ (Twitter/Photo)

Reyiki Veiyi Kallu Review:ఈ మధ్య తమిళ, మలయాళ సినిమాలను తెలుగులోకి ఆహా వాళ్ళు బాగానే తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో విజయం సాధించిన ‘ఇరువక్కు ఆయిరం కంగళ్’ సినిమాను తెలుగులో రేయికి వేయికళ్లు పేరుతో డబ్ చేసారు. డీమోంటీ కాలనీ, డైరీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అరుళ్‌నిధి స్టాలిన్ ఇందులో హీరో. మరి ఈ సినిమా ఎలా ఉంది..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : రేయికి వేయి కళ్లు (Reyiki Veiyi Kallu)

నటీనటులు :అరుళ్ నిధి స్టాలిన్, మహిమ నంబియార్, అజ్మల్ అమీన్ తదితరులు తదితరులు..

ఎడిటర్: శాన్ లోకేష్

సినిమాటోగ్రఫీ: అరవింద్ సింగ్

సంగీతం: శ్యామ్ సిఎస్

దర్శకత్వం: ము. మారన్

విడుదల తేది : 30/9/2022 (ఆహా)

ఈ మధ్య తమిళ, మలయాళ సినిమాలను తెలుగులోకి ఆహా వాళ్ళు బాగానే తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళంలో విజయం సాధించిన ‘ఇరువక్కు ఆయిరం కంగళ్’ సినిమాను తెలుగులో రేయికి వేయికళ్లు పేరుతో డబ్ చేసారు. డీమోంటీ కాలనీ, డైరీ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అరుళ్‌నిధి స్టాలిన్ ఇందులో హీరో. మరి ఈ సినిమా ఎలా ఉంది..?

కథ:

భరత్ (అరుల్ నిధి స్టాలిన్) ఓ సాధారణ కార్ డ్రైవర్. తన లైఫ్ తాను లీడ్ చేస్తుంటాడు. ఆయనకు ప్రేయసి ఉంటుంది. ఆమె పేరు సుశీల (మహిమ నంబియార్)‌. ఇద్దరూ హాయిగా జీవితం గడిపేస్తుంటారు. అలాంటి వాళ్ల లైఫ్‌లోకి గణేష్ (అజ్మల్ అమీన్) వస్తాడు. అమ్మాయిలను మోసం చేసి.. వాళ్లను నమ్మించి బ్లాక్‌మెయిల్ చేయడం గణేష్‌కు అలవాటు. అతడి కంట్లో భరత్ ప్రేయసి సుశీల పడుతుంది. ఆమెను వేధిస్తుంటాడు గణేష్. అదే సమయంలోనే బిజినెస్ మ్యాన్ అయిన మురుగన్ (ఆనంద్ రాజ్), వసంత్ (జాన్ విజయ్) దంపతులను కూడా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తాడు. తన ప్రేయసిని వేధిస్తున్న విషయం తెలుసుకున్న భరత్.. గణేష్‌కు వార్నింగ్ ఇస్తాడు. అతడిని వెంటాడుతున్న సమయంలో గణేష్ ముఠాలో ఉన్న మాయ హత్య జరుగుతుంది. ఆ నేరం భరత్‌పై పడుతుంది. అసలు సుశీలను గణేష్ ఎందుకు వేధిస్తుంటాడు.. మురుగన్‌ను మోసం చేసి డబ్బలెందుకు డిమాండ్ చేస్తాడు.. హత్యా నేరం నుంచి భరత్ ఎలా బయటపడ్డాడు..? వీటి చుట్టూ సాగుతుంది రేయికి వేయికళ్లు కథ..

కథనం, టెక్నికల్ టీం:

నాలుగేళ్ళ కింద తమిళంలో వచ్చిన ‘ఇరువక్కు ఆయిరం కంగళ్’ సినిమాను ఇప్పుడు తెలుగులో రేయికి వేయికళ్లు పేరుతో అనువదించారు. చిన్న లైన్‌తో వచ్చిన ఈ సినిమా అంతా స్క్రీన్ ప్లే బేస్డ్‌గానే సాగుతుంది. మర్డర్ మిస్టరీ చుట్టూ దర్శకుడు మారన్ అద్భుతమైన కథనం రాసుకున్నారు. ప్రేమకథతో మొదలుపెట్టి.. దాన్ని సస్పెన్స్‌లా మార్చి.. చివరికి మర్డర్ మిస్టరీగా అల్లుకున్నాడు దర్శకుడు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్‌తో కథ మొదలవుతుంది. కాస్త నెమ్మదిగానే మొదలయ్యే ఈ కథలోకి విలన్ అజ్మల్ ఎంట్రీ తర్వాత రూపు రేఖలు మారిపోతాయి. ముఖ్యంగా అమ్మాయిలను వలలో వేసి.. బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత స్క్రీన్ ప్లే మరింత ఆసక్తికరంగా మారుతుంది. ఈ కథ ఇలా సాగుతుండగానే.. 50 ఏళ్ల వయసున్న బిజినెస్ మ్యాన్.. 25 అమ్మాయితో సహజీవనం చేయాలనుకొనే ఎపిసోడ్ కూడా ఆకట్టుకుంటుంది. డబ్బుల కోసం వాళ్లను అజ్మల్ మోసం చేయడం.. డబ్బులు లాగడం ఇవన్నీ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరో మర్డర్ కేసులో ఇరుక్కోవడంతో కథలో మలుపు మొదలవుతుంది. వసంత్ భార్య బ్లూ ఫిలిం వీడియో మ్యాటర్, బ్లాక్ మెయిల్ లాంటివి అదిరిపోయే ట్విస్టులు. మాయను ఎవరు హత్య చేశారు అని తెలుసుకునే క్రమం కూడా బాగుంటుంది. కథ చిన్నదే అయినా కూడా ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు దర్శకుడు ము మారన్.

రామారావు ఆన్ డ్యూటీ ఫేమ్ సామ్ సీఎస్ దీనికి సంగీతం అందించాడు. కెరీర్ కొత్తలో ఈయన చేసిన సినిమా ఇది. సీన్స్‌ను తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో నిలబెట్టాడు. అరవింద్ సింగ్ సినిమాటోగ్రఫి.. శాన్ లోకేష్ ఎడిటింగ్ బాగున్నాయి. దర్శకుడు మూ మారన్ స్క్రీన్ ప్లే చక్కగా కుదిరింది.

నటీనటులు:

డబ్బింగ్ సినిమాలతో పరిచయమైన అరుల్ నిధి స్టాలిన్ ఈ సినిమాలో చాలా బాగా కనిపించాడు. స్క్రీన్ మీద ఈజ్ ఉంటుంది. పక్కింటి అబ్బాయిగా ఉంటూనే.. అవసరమైనప్పుడు అన్ని ఎమోషన్స్ చూపించాడు. రంగం ఫేమ్ అజ్మల్ అమీన్ అయితే మరోసారి విలనిజంతో చెలరేగిపోయాడు. అతడి పాత్ర సినిమాను నిలబెట్టిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సీనియర్ నటుడు ఆనంద్ రాజ్, జాన్ విజయ్ పాత్రలు బాగున్నాయి. హీరోయిన్ మహిమా నంబియార్ ఉన్నంతలో ఓకే. మిగిలిన పాత్రలు ఓకే..

ప్లస్ పాయింట్స్

ఆకట్టుకునే స్క్రీన్ ప్లే

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్ 

లవ్ ట్రాక్

ఫస్టాఫ్

చివరగా ఒక్కమాట: రేయికి వేయికళ్లు.. ఆకట్టుకునే మర్డర్ మిస్టరీ

రేటింగ్: 2.75/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు