Chiranjeevi - Gaddar: మెగాస్టార్ చిరంజీవి సినిమాలో గద్దర్.. కాంబినేషన్ ఖతర్నాక్‌గా ఉంది కదా..!

చిరంజీవి సినిమాలో గద్దర్ (Chiranjeevi Gaddar)

Chiranjeevi - Gaddar: చిరంజీవి సినిమాలో ముఖ్య పాత్ర‌ కోసం గ‌ద్ధ‌ర్‌ని (Chiranjeevi - Gaddar) తీసుకున్నారని తెలుస్తుంది. ఆయన కూడా కథ నచ్చడంతో ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని తెలుస్తుంది. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్ధర్ పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

  • Share this:
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తైపోయింది. చిన్న చిన్న వర్కలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ మధ్యే గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాడు మెగాస్టార్. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కోసం తన లుక్ కూడా మార్చుకున్నాడు చిరంజీవి. ఖైదీ నెం 150 చిత్రంతో పదేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఆ తర్వాత రెండేళ్ళకు సైరా చేసాడు. గత రెండేళ్ళుగా ఈయన నుంచి సినిమాలు రాలేదు. అయితే రాబోయే రెండేళ్లలో నాలుగు సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు చిరంజీవి. అందుకే వ‌రుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు మెగాస్టార్. ఈ క్రమంలోనే మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా మొదలు కానుంది. ఈ సినిమాలో ప్రజా యుద్ధనౌక, జన నాట్య మండలి కళాకారుడు గద్దర్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రజా గాయకుడు గద్ధర్‌కు సినిమాలు కొత్త కాదు. గతంలోనూ కొన్ని సినిమాల్లో కనిపించాడు.. పాడి వినిపించాడు కూడా. మొన్నటికి మొన్న సుడిగాలి సుధీర్ హీరోగా వచ్చిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలోనూ ఓ పాటలో నర్తించాడు గద్దర్.

ఇప్పుడు కూడా చిరంజీవి సినిమాలో ముఖ్య పాత్ర‌ కోసం గ‌ద్ధ‌ర్‌ని తీసుకున్నారని తెలుస్తుంది. ఆయన కూడా కథ నచ్చడంతో ఆ పాత్ర‌లో న‌టించేందుకు ఓకే చెప్పార‌ని తెలుస్తుంది. వైజాగ్ జైలులో చిత్రీకరించే సన్నివేశాల్లో గద్ధర్ పాల్గొనబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి కాంబినేషన్‌లోనే ఈ సన్నివేశాలు ఉండబోతున్నాయి. గాడ్ ఫాదర్ సినిమాలో కేవలం తెలుగు నటులు మాత్రమే కాదు.. తమిళ, మలయాళ నటులు కూడా భాగం కాబోతున్నారు.

Bigg Bogg 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగులో జబర్దస్త్ ట్రాన్స్‌జెండర్.. ఆపరేషన్ తర్వాత అదిరిపోయే ఆఫర్..



వైజాగ్ షెడ్యూల్ ఇప్పటికే మొదలవ్వాల్సి ఉన్నా కూడా అజిత్ వాలిమై షూటింగ్ కోసం సినిమాటోగ్రఫర్ నీరవ్ షా రష్యా వెళ్లాడు. ఆయనే గాడ్ ఫాదర్ సినిమాకు కూడా డిఓపీ. అందుకే షూటింగ్ కాస్త ఆలస్యంగా మొదలు కానుంది. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్, NVR ఫిలింస్ బ్యానర్స్ సంయుక్తంగా గాడ్ ఫాదర్ సినిమాను నిర్మిస్తున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో యాంకర్ అనసూయతో పాటు బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. వీటితో పాటే మెహర్ రమేష్ భోళా శంక‌ర్, బాబీ సినిమాలకు కూడా కమిటయ్యాడు మెగాస్టార్.
Published by:Praveen Kumar Vadla
First published: