హోమ్ /వార్తలు /సినిమా /

Republic Day 2023: ఎత్తర జెండా అంటూ దేశభక్తి చాటిన తెలుగు సినిమా.. నాటి నుంచి నేటి వరకు అలరించిన పాటలు ఇవే..

Republic Day 2023: ఎత్తర జెండా అంటూ దేశభక్తి చాటిన తెలుగు సినిమా.. నాటి నుంచి నేటి వరకు అలరించిన పాటలు ఇవే..

 తెలుగు సినిమాల్లో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు గీతాలు (File/Photo)

తెలుగు సినిమాల్లో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చిత్రాలు గీతాలు (File/Photo)

Republic Day 2023 | భారత దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దేశ సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా మారిన రోజు. ఈ రోజు మనందరం 74వ గణతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుక. ఈ జెండా పండత సందర్భంగా దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Republic Day 2023 | భారత దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. దేశ సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా మారిన రోజు. ఈ రోజు మనందరం 74వ గణతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. జాతి, కుల, మత, ప్రాంతమనే తేడాల్లేకుండా.. ఆ సేతు హిమాచలం ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే వేడుక. ఈ జెండా పండత సందర్భంగా దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకుందాం.  దేశభక్తిని.. జెండా గొప్పతనాన్ని  ఎందరో సినీ కవులు తమ కలంతో స్ఫూర్తి దాయకంగా చెప్పారు. దేశభక్తిని రగిలించిన కొన్ని పాటలను ఈ 74వ గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకుందాం.  . ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో అలరించిన కొన్ని దేశ భక్తి గీతాలేమిటో చూద్దాం..

' isDesktop="true" id="1596670" youtubeid="5imVvj_P5tE" category="movies">

మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాటను అందరినీ తట్టిలేపింది. 2020  సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

' isDesktop="true" id="1596670" youtubeid="bqA_zXNZvUc" category="movies">

రాముడు భీముడులో ఉందిలే మంచి కాలం స్వాతంత్య్రం నాటి కాలాన్ని గుర్తుకు తెస్తోంది. డి. రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలోని పాట ఎపుడు స్వాతంత్య్ర, గణతంత్య్ర దినోత్సవాల రోజున వినపడుతూనే ఉంటుంది.

' isDesktop="true" id="1596670" youtubeid="DpSOjq7yIto" category="movies">

మేజర్ చంద్రకాంత్‌లోని ఈ పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమా హీరోగా ఎన్టీఆర్ నటించిన చివరి చిత్రం.

' isDesktop="true" id="1596670" youtubeid="avBaFtPkuhw" category="movies">

స్వాతంత్య్రం వచ్చిందని సంబరపడితే కాదు. మనమెలా మెలిగితే దానికి సార్థకత చేకూరుతుందో తెలిపే కమ్మని పాట.. పాడవోయి భారతీయుడా అనే పాట వెలుగు నీడలు సినిమాలో ఉంది.

' isDesktop="true" id="1596670" youtubeid="Uj0IRa6EbcE" category="movies">

ఎన్టీఆర్ హీరొోగా నటించిన ‘బడి పంతులు’ సినిమాలోని ఈ పాట ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజు వినిపిస్తూనే ఉంటుంది.

' isDesktop="true" id="1596670" youtubeid="DKOu_cYb7cM" category="movies">

‘ఖడ్గం’లో మే మే ఇండియన్స్ పాట దేశభక్తిని చాటి చెబుతోంది. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట ఎప్పటికీ నిలిచిపోతుంది.

' isDesktop="true" id="1596670" youtubeid="nF27vAJFa6I" category="movies">

ఏఎన్నార్ నటించిన ‘సిపాయి చిన్నయ్య’లోని ఈ సాంగ్ జన్మభూమిని గొప్పదనాన్ని తెలుపుతూ ఉన్న ఈ పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

' isDesktop="true" id="1596670" youtubeid="5R2gVd5DvZY" category="movies">

‘బద్రి’లోని ఐ యామ్ ఇండియన్ సాంగ్ మన భారతీయతను చాటే పాట. పూరీ జగన్నాథ్ తొలి సినిమాలోనే పవన్ కళ్యాణ్‌తో ఈ తరహా పాటను తెరకెక్కించాడు. అటు ఖుషీలో కూడా ‘ఏ మేరా జహాన్’ పాట కూడా దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కిందే.

' isDesktop="true" id="1596670" youtubeid="QxFxVGoJgPA" category="movies">

‘బాబీ’సినిమాలో ఈ పాట కూడా దేశభక్తిని చాటుతుంది. శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కే.రాఘవేంద్రరావు సమర్ఫణలో తెరకెక్కింది.

' isDesktop="true" id="1596670" youtubeid="8oTbzver_c0" category="movies">

కృష్ణ హీరోగా నటించిన ‘అల్లూరి సీతారామరాజు’లోని తెలుగువీర లేవరా పాట స్వాతంత్య్ర స్పూర్తిని రగిలిస్తుంది. శ్రీశ్రీ రచించిన ఈ పాటతో తెలుగు పాటకు తొలిసారి జాతీయ అవార్డు వచ్చింది. ఈ పాట ఎందరికో స్పూర్తి రగిలించింది.

' isDesktop="true" id="1596670" youtubeid="zUic9gUnnPM" category="movies">

‘బొబ్బిలిపులి’లోని జననీ జన్మభూమిశ్చ పాట కూడా జన్మభూమి స్వర్గం కన్న గొప్పది అంటూ చెప్పే దేశభక్తి గీతం. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్ దేశ భక్తి గీతాల్లో ఒకటి.

' isDesktop="true" id="1596670" youtubeid="bYYZedGmnYc" category="movies">

‘కోడలు దిద్దిన కాపురం’లో ఈ పాట దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహానుభావులను గుర్తుకు తెస్తుంది. ఈ దేశం ఈ సంఘం నిను మరవద్దు .. జాతిని నడిపిన నీతిని నిలిపిన మహనీయులను మరవద్దు అంటూ వచ్చిన సాంగ్ దేశభక్తిని ప్రేరేపించేదే.

' isDesktop="true" id="1596670" youtubeid="-b0wndMSzn8" category="movies">

‘నేటి భారతం’లో భారత నారిని నేను బందినై పడి ఉన్నాను సాంగ్ కూడా దేశభక్తిని గుర్తుకు తెచ్చే పాట. ఈ  సినిమాలోని పాట ఎప్పటికీ ఎవర్ గ్రీన్.

' isDesktop="true" id="1596670" youtubeid="VZKu6yXe5bU" category="movies">

‘సుల్తాన్’ సినిమాలో జనగణమన జనయిత్రి నా జన్మ భూమి పాట కూడా స్వాతంత్య్ర స్తూర్తిని రగిలించే పాటల్లో ఒకటి. జాలాది రాసిన పాటకు కోటి అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. ఇందులో కృష్ణ,కృష్ణంరాజు, బాలకృష్ణ వంటి టాలీవుడ్ కృష్ణత్రయం ఈ దేశభక్తి గీతంలో నటించడం విశేషం.

' isDesktop="true" id="1596670" youtubeid="4HgnAolSdFQ" category="movies">

‘ఝుమ్మంది నాదం’లో దేశమంటే ఈ పాట కూడా జాతీయతను చాటుతుంది. కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోని పాట దేశభక్తిని చాటుతుంది.

' isDesktop="true" id="1596670" youtubeid="ccbp0_ZqMBY" category="movies">

అటు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్‌లోని ‘ఎత్తర జెండా’ పాట దేశ భక్తిని నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, రాజమౌళి అతిథి పాత్రల్లో మెరిసారు. ఇప్పటికే  ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. ఆస్కార్‌కు ఈ సినిమాలోని తెల్లవాళ్లను ఆటపట్టించే ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు పోటీ పడుతోంది. ఏది ఏమైనా ఈ యేడాది తెలుగు సినిమా అంతర్జాతీయ యవనిక పై రెపరెపలాడాలని కోరుకుందాం.  వీటితో పాటు ఎన్నో దేశ భక్తి గీతాలు టాలీవుడ్‌లో తెరకెక్కాయి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.

అనేక వందల సంత్సరాలు దాస్య శృంఖాలల్లో మగ్గిన ఈ భారతదేశం.. స్వేచ్ఛ సాధించి, ఆధునికత వైపు వడి వడిగా పయనిస్తోంది. దేశం అభివృద్ధిలో సాధించిన విజయాలను నాటి నుంచి నేటి వరకూ మన తెలుగు సినిమా పాటలు ప్రస్తావిస్తూనే వచ్చాయి. 74వ గణతంత్య్ర  దినోత్సవం  సందర్భంగా  స్వతంత్య్ర భారతవనితో పాటు ఈ స్వేచ్ఛాగీతాలకు వందనం అర్పిద్దాం. అందరికీ అమ్మవైన ఓ భారతమాతా.. కాశ్మీరే నీకు తలమానికం. హస్తినే నీ హృదయం.. భరతదేశమే నీ దేహం. అందుకో జేజేలు. ఎందరో మహాత్ములు త్యాగఫలంతో దక్కిన ఈ స్వాతంత్య్రాన్ని భావితరాలకు అలాగే అందించడానికి అందరం కలసి కృషిచేద్దాం. మరోసారి అందరికీ భారత గణతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.

First published:

Tags: Republic Day 2023, RRR, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు