Republic - Aishwarya Rajesh | ‘రిపబ్లిక్’ (Republic)మూవీలో ఆసక్తి రేకిత్తిస్తోన్న ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) లుక్.. వివరాల్లోకి వెళితే.. వరుస విజయాలతో అదరగొడుతోన్న మెగా హీరో సాయి తేజ్ (Sai Tej) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'రిపబ్లిక్'. ఈ సినిమాను దేవా కట్టా (Deva Katta) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమకాలీన రాజకీయాలను చూపెట్టనున్నారు. సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తోంది. వరుసగా మూడు చిత్రాల హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన సాయి తేజ్ హీరోగా వస్తుండడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు వున్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ(Mani Sharma) సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య విడుదలైన టీజర్ మంచి ఆదరణ పొందింది.
తాజాగా ఈ సినిమాలో ఐశ్యర్య రాజేష్‌కు సంబంధించిన లుక్‌ను రమ్యకృష్ణ విడుదల చేసారు. కూలిపొతాం, కుంగిపొతాం, ఓడిపొతాం.. అయినా.. నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం అంటూ మైరా హన్సన్ పాత్రలో ఐశ్యర్య రాజేష్ నటిస్తోంది. ఆమె లుక్ టెర్రిఫిక్‌గా ఉంది. ఈ సినిమాలో ఐశ్యర్య ఫెరోషియస్ యంగ్ పొలిటిషన్ పాత్రలో నటిస్తోన్నట్టు తెలుస్తోంది.
కూలిపొతాం, కుంగిపొతాం, ఓడిపొతాం! అయినా... నిలబడతాం, కోలుకుంటాం, గెలుస్తాం!
Happy to reveal the First Look of @aishu_dil as #MyraHanson from #REPUBLIC✊#RepublicFromOct1st@IamSaiDharamTej @devakatta @meramyakrishnan @IamJagguBhai #ManiSharma@mynnasukumar @bkrsatish@JBEnt_Offl pic.twitter.com/dMGu6QbnoJ
— Ramya Krishnan (@meramyakrishnan) August 26, 2021
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 'రిపబ్లిక్' మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ముందుగా ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఐతే.. మేకర్స్ మాత్రం థియేటర్స్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..
ఐశ్యర్య రాజేష్ విషయానికొస్తే.. తెలుగులో ‘కౌసల్య కృష్ణమూర్తి’ సినిమాతో పరిచయమైంది. అంతకు ముందు పలు తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలతో పాటు తెలుగులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాలి హీరోలుగా నటిస్తోన్న ‘భీమ్లా నాయక్’ మూవీలో రానాకు జోడిగా నటిస్తోంది. ఈ సినిమా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కుతోంది. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, కథా సహాకారం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాతో పాటు నాని హీరోగా నటిస్తోన్న ‘టక్ జగదీష్’లో ఐశ్యర్య రాజేష్ కథానాయికగా నటించింది. ఎపుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఓటీటీ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఎగ్జిబిటర్స్, నాని మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఆ తర్వాత నానికి, థియేటర్స్ ఎగ్జిబిటర్స్‌కు మధ్య సయోధ్య కుదిరింది. నాని ఈ శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్టు చెప్పారు. మొత్తంగా ఐశ్యర్య రాజేష్ తెలుగులో వరుసగా క్రేజీ సినిమాలతో పలకరించబోతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aishwarya Rajesh, Ramya Krishna, Republic Teaser, Sai Dharam Tej, Tollywood