పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య.. నటి రేణుదేశాయ్ (Renu Desai)మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. బద్రి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు. జానీ(Johnny) తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పవన్ కళ్యాన్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడుకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. కొన్నేళ్ల నుంచి కూడా రేణు దేశాయ్ నటనకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయలేదు. అయితే ఇప్పుడు తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మేకప్ వేసుకుంటున్న రెండు వీడియోలు... తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేశారు. ‘నా జుట్టు తెల్లగా మారుతోంది. నాకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు. దీంతో పాటు.. స్లీపీ మార్నింగ్ అంటూ మరో వీడియోను కూడా ఇన్‌స్టాలో పెట్టారు రేణు దేశాయ్.. ఈ వీడియోలో రేణు నిద్రమత్తులో ఉన్నారు. కళ్లు మూసుకుపోతున్న వీడియోను ఆమె పోస్టు చేశారు. అయితే ఆమె పోస్టుపై పలువును నెటిజన్లు స్పందిస్తున్నారు. టైగర్ నాగేశ్వర్రావు సినిమా షూటింగ్ గురించి మేకప్ వేసుకుంటున్నారా అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించారు. ఈ మూవీలో మీ రోల్ ఏంటి మేడమ్ అని కొదరు అడుగుతున్నారు. మరికొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జై పవర్ స్టార్స్ అని కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు. ఉగాది రోజున ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ లాంచింగ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. టైగర్ నాగేశ్వరరావు లాంఛింగ్ ఈవెంట్లో రేణు దేశాయ్ సినిమాల్లో రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. పాత్ర మంచిదిగా అనిపిస్తే రేణు దేశాయ్ నటిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాతో ఆమె వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘‘నాకు యాక్ట్ చేయాలని, సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాలనే ఆలోచనే లేదు. కానీ 2019లో డైరెక్టర్ వంశీ నన్ను కలిసి టైగర్ నాగేశ్వరరావు సినిమా గురించి చెప్పారు. అందులో నా పాత్రను బాగా డిజైన్ చేశారు. వంశీగారి కన్విక్షన్ నాకు బాగా నచ్చింది. వంశీ తప్పకుండా చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు’’ అన్నారు రేణు.
అయితే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణు దేశాయ్ ఎలాంటి పాత్ర చేయనుందో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆమె ఈ సినిమాలో రవితేజ సోదరి పాత్రలో కనిపిస్తారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 1970 దశకంలో స్టువర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది రవితేజకి తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.
Published by:Sultana Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.