పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ వార్నింగ్.. వాళ్లు నా రక్తమే..

రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది.తాజాగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన తన పిల్లల ఫోటో వివాదానికి కేంద్ర బిందువు అయింది.

news18-telugu
Updated: December 31, 2019, 11:37 AM IST
పవన్ కళ్యాణ్ అభిమానులకు రేణు దేశాయ్ వార్నింగ్.. వాళ్లు నా రక్తమే..
ఆద్య, అకిరాతో రేణుదేశాయ్ (Image: Instagram)
  • Share this:
రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్‌గా రేణు తన పిల్లలకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వివాదానికి కేంద్ర బిందువు అయింది. ఈ ఫోటోలో అకిరా తన చెల్లెలు ఆద్యను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసిన రేణు..123 లెక్క పెట్టే లోపు నేను మీ ముందు ఉంటా.. క్రేజీ ఫెలోస్.. మీ ఇద్దరూ నా సొంతం అంటూ సోషల్ మీడియాలో మెసెజ్ చేసింది. దానికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఎంతైనా పవన్ కళ్యాణ్ రక్తం కదా అంటూ స్పందించాడు. మీకు సైన్స్ తెలియదనుకుంటా. తెలిస్తే నేను సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. సైన్స్ పరంగా చెప్పాలంటే ఇద్దరిలో నా రక్తమే ప్రవహిస్తుంది. అమ్మతనం గురించి మాట్లాడుతుంటే నేను సైలెంట్‌గా ఉండలేనంటూ సదరు నెటిజన్‌కు రేణు దేశాయ్ కాస్తా గట్టిగానే ఇచ్చుకుంది.



Published by: Kiran Kumar Thanjavur
First published: December 31, 2019, 11:37 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading