HOME »NEWS »MOVIE »renu desai shared rare photo of pawan kalyan with chiledren goes viral on social media ta

Renu Desai-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్..

Renu Desai-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అరుదైన ఫోటోను షేర్ చేసిన రేణు దేశాయ్..
రేణు దేశాయ్ (Instagram/Photo)

Renu Desai -Pawan Kalyan | రేణు దేశాయ్ ఓ హీరోయిన్‌గా, దర్శకురాలిగా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్‌గానే ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం. తాజాగా రేణు దేశాయ్.. తన భర్తకు సంబంధించిన అరుదైన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.

  • Share this:
    Renu Desai -Pawan Kalyan | రేణు దేశాయ్ ఓ హీరోయిన్‌గా, దర్శకురాలిగా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్‌గానే ప్రేక్షకులకు ఎక్కువగా పరిచయం. వీళ్లిద్దరు కొన్నేల్లు డేటింగ్ చేసి ఒక పిల్లాడు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. తాజాగా రేణు దేశాయ్.. తాను నటిగా రీ ఎంట్రీ  ఓ వెబ్ సిరీస్‌తో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్‌ షూటింగ్ జరుగుతుంది.

    పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్.. భార్య భర్తలుగా విడిపోయినా.. తల్లితండ్రులుగా మాత్రం విడిపోలేదు. పిల్లలు రేణు దేశాయ్ దగ్గర ఉన్నారన్న మాటే కానీ.. పవన్ కళ్యాణ్ ఎప్పటి కప్పుడు వాళ్ల బాగోగులు చూసుకుంటూ ఉంటాడు. తాజాగా రేణు దేశాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్, తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పెట్టుకున్న ఫోటోను షేర్ చేశారు. కొన్ని అందమైన ఫోటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు.


    View this post on Instagram

    A post shared by renu desai (@renuudesai)



    తాను కొన్ని అరుదైన చిత్రమాలికను తన ఫోన్‌లో ఉన్న కెమెరాతో క్లిక్ అనిపించినట్టు చెప్పుకొచ్చారు. రేణు దేశాయ్ పోస్ట్ చేసిన పోస్ట్ లపై నెటిజన్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒకటే ఖుషీ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:December 02, 2020, 15:00 IST

    टॉप स्टोरीज