• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • RENU DESAI SENSATIONAL TWEET ABOUT ONE OF THE LEADING BANK TA

Renu Desai: రేణు దేశాయ్ సంచలన ట్వీట్.. ఈ సారి మాత్రం..

రేణు దేశాయ్ (Renu Desai/Instagram)

Renu Desai: రేణు దేశాయ్ సంచలన ట్వీట్ చేసింది. ఈమె ఈ ట్వీట్ ఇపుడు హట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    Renu Desai: రేణు దేశాయ్ సంచలన ట్వీట్ చేసింది. ఈమె ఈ ట్వీట్ ఇపుడు హట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రేణు దేశాయ్ ఒక నటి కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలు అకిరానందన్, ఆద్యాతో  కలిసి పూణెలో ఉంటోంది. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్‌తో నేరుగా కలవకపోయినా.. తన పిల్లలను పవన్ కళ్యాణ్‌‌కు మాత్రం దూరం చేయలేదు. గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్‌లో వీళ్లు పవన్ కళ్యాణ్‌తో కలిసి సందడి చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్.

    మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. కానీ  రేణు దేశాయ్.. తాను నటిగా ఓ వెబ్ సిరీస్‌తో  రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా రేణు దేశాయ్.. ఓ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది.








    View this post on Instagram






    A post shared by renu (@renuudesai)





    తాజాగా రేణు దేశాయ్.. తన ఇన్‌స్టా‌లో ఓ బ్యాంక్‌కు సంబంధించిన మెసెజ్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఈ విధంగా ప్రస్తావించారు. ఆమె ఇండస్ బ్యాంక్ మొబైల్ యాప్‌లో తన అకౌంట్‌లో లాగిన్ అయ్యారు. ఊతే.. ఆ అకౌంట్ ఆమెది కాదట. వేరే వాళ్లకు సంబంధించిన అకౌంట్‌లో లాగిన్ అయినట్టు పేర్కొంది. ఈ విషయం బ్యాంక్ వాళ్లకు హెల్ప్ లైన్‌లో చెప్పిన సందరు బ్యాంక్ వాళ్లు  స్పందిచలేదని చెప్పుకొచ్చారు. ఇలా బ్యాంక్ అకౌంట్ విషయంలో నిర్లక్ష్యం వహించిన సదరు బ్యాంక్ అకౌంట్‌ను ఈ సోమ వారం క్లోజ్ చేయబోతున్నట్టు చెప్పి సదరు బ్యాంక్‌కు షాక్ ఇచ్చారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: