మంత్రి కొడుకును నడిరోడ్డుపై చంపే దుమ్ముందా.. రేణు దేశాయ్ సంచలనం..

దిశ.. దిశ.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయానికి పోలీసులు సరైన న్యాయం చేసారంటూ చాలా మంది నిందితుల ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తున్నారు కూడా.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 8, 2019, 2:44 PM IST
మంత్రి కొడుకును నడిరోడ్డుపై చంపే దుమ్ముందా.. రేణు దేశాయ్ సంచలనం..
రేణు దేశాయ్(ఫైల్ )
  • Share this:
దిశ.. దిశ.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయానికి పోలీసులు సరైన న్యాయం చేసారంటూ చాలా మంది నిందితుల ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తున్నారు కూడా. అయితే ఇదే విషయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు కూడా. కచ్చితంగా దిశకు జరిగింది అన్యాయమే.. అంత కిరాతకంగా చంపిన వాళ్లను చంపడం తప్పే కాదు అంటున్నారు కానీ అలా చనిపోవడం మాత్రం సరైన పద్దతి కాదు అంటున్నారు కొందరు. ముఖ్యంగా అందులో రేణు దేశాయ్ కూడా ఇదే విషయంపై స్పందించింది. తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్ గురించి ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. చనిపోయిన నలుగురు నిరుపేదలే.. వాళ్లు చేసింది తప్పే కానీ కచ్చితంగా ఇలా చంపుకుంటూ పోతే ఏం చెప్పాలని అంటూ ప్రశ్నించింది రేణు.
Renu Desai sensational comments on Disha accused encounter and she questioned government pk దిశ.. దిశ.. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే పేరు వినిపిస్తుంది. ఆమెకు జరిగిన అన్యాయానికి పోలీసులు సరైన న్యాయం చేసారంటూ చాలా మంది నిందితుల ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తున్నారు కూడా. disha,disha accused encounter,disha case,disha murder case,disha renu desai,renu desai movies,renu desai disha encounter,renu desai pawan kalyan,telugu cinema,రేణు దేశాయ్,రేణు దేశాయ్ దిశ ఎన్‌కౌంటర్,దిశ నిందితుల ఎన్‌కౌంటర్,తెలుగు సినిమా
రేణు దేశాయ్ ఫైల్ ఫోటో (Source: Youtube)

కచ్చితంగా వాళ్లు చేసింది తప్పే కాబట్టి చంపడం కరెక్టే కానీ అలా చంపడం మాత్రం సరైంది కాదని చెబుతుంది రేణు దేశాయ్. అదే స్థానంలో మంత్రి కొడుకు ఉంటే ఇలాగే నడిరోడ్డు మీద కాల్చేస్తారా అని ప్రశ్నించింది రేణు. కచ్చితంగా అలా చేసే వాళ్లు కాదు.. అక్కడ పెద్దోళ్ల కొడుకులు ఉంటే చంపేంత దమ్ము ఎవ్వరికీ లేదని చెబుతుంది రేణు. తప్పు చేసిన వాళ్లకు కచ్చితంగా శిక్ష పడాల్సిందే కానీ పడాల్సిన రీతిలో పడాలి లేదంటే అందరికీ ఒకేలా న్యాయం చేయాలంటుంది రేణు. వీళ్లను ఎన్‌కౌంటర్ చేసినపుడు కచ్చితంగా వాళ్లను కూడా ఎన్‌కౌంటర్ చేయాల్సిందే కదా అంటుంది. మొత్తానికి రేణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: December 8, 2019, 2:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading