Renu Desai : రెండు లగ్జరీ కార్స్ అమ్మేసిన రేణు దేశాయ్.. కారణం తెలిస్తే షాక్..

Renu Desai : రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటూ... ఆసక్తికర అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది.

news18-telugu
Updated: August 11, 2020, 3:38 PM IST
Renu Desai : రెండు లగ్జరీ కార్స్ అమ్మేసిన రేణు దేశాయ్.. కారణం తెలిస్తే షాక్..
రేణు దేశాయ్..Photo: Instagram
  • Share this:
Renu Desai : మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో  చేసిన మొదటి సినిమాతోనే ఆమె భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ‘బద్రీ’ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో కలిసిన నటించిన రేణూ.. పవన్‌తో తొలి పరిచయంతోనే ప్రేమలో పడింది. అయితే చాలా కాలం పాటు బాగానే సాగిన వీళ్ల కాపురంలో మనస్పర్థలు వచ్చి విడిగా ఉంటున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. కొన్ని సినిమాలకు దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేసింది రేణూ దేశాయ్. ఇక పవన్‌తో విడిపోయిన తర్వాత పిల్లలతో కలిసి పూణెలో నివాసం ఉంటోంది. బాధ్యత గల తల్లిగా జీవనాన్ని కొనసాగిస్తున్నా రేణు దేశాయ్.. ఎలాంటి కాంట్రవర్సీల జోలికి పోకుండా చాలా సింపుల్ గా జీవనం సాగిస్తున్నారు.








View this post on Instagram





. Guys please start finding out about electric cars and bikes and please think about buying them instead of regular petrol/diesel alternatives. I sold both my fuel guzzling imported cars, Audi A6 & Porsche Boxter and bought this electric Hyundai Kona. It truly was a difficult decision to sell both my cars but I sincerely want to reduce my carbon footprint as much as possible! After reading about the oil spill in Mauritius, I really request all of you to go fossil fuel free. Yesterday’s new about the oil spill has deeply disturbed me. We humans are truly a cancer to this Earth and other species. We are so selfish. One day soon I am going to go live on a farm away from city life and try to reduce my contribution to the destruction of this planet. Till then trying to do my best to reduce the existing damage! Also important part is that my petrol/diesel bills used to be more than 15k a month but now because of my electric car the current bill is hardly 700-800₹, so I am saving a lot of money while saving the planet😁


A post shared by renu desai (@renuudesai) on





అది అలా ఉంటే.. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఉంటూ... ఆసక్తికర అంశాలను తన ఫాలోవర్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా అలాంటిదే రేణు దేశాయ్ ఈసారి కూడా ఓ అలాంటి ఆసక్తికర అంశాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా ఆమె తన పోస్ట్‌లో రాస్తూ.. పెట్రోల్, డిజిల్‌తో నడిచే కార్ల కంటే కూడా విద్యుత్ తో నడిచే కార్లను వినియోగించమని చెబుతున్నారు. అంతేకాదు ఆమె తన లగ్జరీ కార్లు అయినటువంటి ఆడి ఏ6, పోర్ష్ బాక్స్టెర్ ను అమ్మి కొత్త ఎలెక్ట్రిక్ కారును కొనుకున్నానని తెలిపింది. దీనికి అంతటికి ప్రధాన కారణం తన వంతుగా తాను పర్యావరణంలో కార్బన్ ను తగ్గించడం కోసమే అని రేణు దేశాయ్ తెలిపారు.
Published by: Suresh Rachamalla
First published: August 11, 2020, 3:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading