Renu Desai: రేణు దేశాయ్ రీ ఎంట్రీకి రంగం సిద్దం... అఫీషియల్ ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య..

Renu Desai Re Entry | రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. తాజాగా ఈమె నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

news18-telugu
Updated: September 20, 2020, 6:58 PM IST
Renu Desai: రేణు దేశాయ్ రీ ఎంట్రీకి రంగం సిద్దం... అఫీషియల్ ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య..
రేణు దేశాయ్ (Instagram/Photo)
  • Share this:
Renu Desai Re Entry | రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ రేణు దేశాయ్.. వేటికి యస్ చెప్పలేదు. తాజాగా రేణు దేశాయ్.. తాను నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటిచింది.








View this post on Instagram






A post shared by renu desai (@renuudesai) on





ఐతే.. రేణు దేశాయ్.. సినిమాల్లో కాకుండా.. వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్టు తెలిపింది.అంతేకాదు చాలా ఏళ్ల తర్వాత కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. వచ్చే నెలలో ఈ వెబ్ సిరీస్ ప్రారంభించబోతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీర్వాదాలు, ప్రేమ కావాలంటూ అభిమానులను కోరింది. ఇక రేణు దేశాయ్ చేయబోయే ఈ వెబ్ సిరీస్ న్యాయం కోసం పోరాడే ఓ యువతి కథ అని చెప్పుకొచ్చింది. ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పై డీఎస్ రావు, ఎస్.రజినీకాంత్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎం.ఆర్.కృష్ణ మామిడాల ఈ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేస్తున్నట్టు చెప్పింది. ఈ సందర్భంగా వెబ్ సిరీస్‌లో అలరించబోతున్న రేణు దేశాయ్ కు అభిమానులు బెస్ట్ విషెస్ తెలియజేసారు. రేణు దేశాయ్ విషయానికొస్తే.. పవన్ కళ్యాన్ హీరోగా పూరీ జగన్నాధ్ తెరకెక్కించిన  బద్రి సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘జానీ’ సినిమాల్లో పవన్ కళ్యాణ్ సరసన నటించింది. ఆ తర్వాత పవన్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసింది. ప్రస్తుతం ఈమె రైతు సమస్యలు, జీవితాలపై ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని పాటల కోసం రేణు దేశాయ్.. ప్రముఖ కవి గోరటి వెంకన్నను కలిసిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 20, 2020, 6:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading