మహేష్ బాబుకు అమ్మను అవుతానంటున్న రేణు దేశాయ్..

Mahesh Babu Renu Desai: వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. తాను నిజంగానే మహేష్‌కు అమ్మగా నటించాలనుకుంటుంది రేణు. గతంలో పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం సినిమాలో..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 1, 2020, 4:11 PM IST
మహేష్ బాబుకు అమ్మను అవుతానంటున్న రేణు దేశాయ్..
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)
  • Share this:
వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. తాను నిజంగానే మహేష్‌కు అమ్మగా నటించాలనుకుంటుంది రేణు. గతంలో పవన్ కళ్యాణ్‌తో సుస్వాగతం సినిమాలో హీరోయిన్‌గా నటించిన దేవయాని నాని సినిమాలో సూపర్ స్టార్‌కు అమ్మగా నటించింది. ఇప్పుడు రేణు దేశాయ్ కూడా అమ్మగా నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. ఇంతకీ విషయం ఏంటంటే.. కరోనా కారణంగా అంతా ఇంటికే పరిమితం అయిపోయారు. బోర్ కొట్టకుండా అప్పుడప్పుడూ ఆన్‌లైన్‌లో దర్శనమిస్తున్నారు. ఇప్పుడు కూడా రేణు దేశాయ్ ఇదే చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్‌కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.
రేణు దేశాయ్ (Renu Desai)
రేణు దేశాయ్ (Renu Desai)


మహేష్‌, ప్రభాస్ వంటి హీరోలకు తల్లిగా నటించే అవకాశం వస్తే చేస్తారా అని అడిగారు నెటిజన్లు. దానికి రేణు దేశాయ్ కూడా చాలా కూల్‌గా సమాధానమిచ్చింది. హీరోల చిన్నతనంలోని పాత్రలకు తల్లి పాత్ర చేయడానికి సిద్ధమేనని సమాధానం చెప్పింది రేణు.
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)
మహేష్ బాబు రేణు దేశాయ్ (mahesh babu renu desai)

ఇక తనను ముసలి లుక్‌లో బాగా చూపింగలరనే నమ్మకం దర్శకులకు ఉంటే మాత్రం తనకు మహేష్‌ బాబు లాంటి హీరోలకు తల్లిగా నటిచేందుకు సిద్ధమేనని రేణు తెలిపింది. అన్నట్లు మహేష్ బాబు కంటే వయసులో 8 ఏళ్లు రేణు దేశాయ్ చిన్నది. తామంతా నటులం అని.. ఎలాంటి పాత్ర అయినా పోషించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పింది రేణు. ప్రస్తుతం ఈమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published by: Praveen Kumar Vadla
First published: May 1, 2020, 4:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading