అకిరా నందన్ ఆన్‌లైన్ క్లాసెస్.. ల్యాప్‌టాప్ ముందు బిజీ బిజీ..

Akira Nandan: సినిమాలు చేసినా చేయకపోయినా అకిరా నందన్ అంటే ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు బాగానే పరిచయం. దానికి కారణం పవన్ కళ్యాణ్ తనయుడు కావడమే.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 14, 2020, 8:33 PM IST
అకిరా నందన్ ఆన్‌లైన్ క్లాసెస్.. ల్యాప్‌టాప్ ముందు బిజీ బిజీ..
అకిరా నందన్ (akira nandan)
  • Share this:
సినిమాలు చేసినా చేయకపోయినా అకిరా నందన్ అంటే ఇప్పటికే తెలుగు ఆడియన్స్‌కు బాగానే పరిచయం. దానికి కారణం పవన్ కళ్యాణ్ తనయుడు కావడమే. తనేం చేసినా కూడా సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయిపోయాడు. దానికి తోడు అమ్మ రేణు దేశాయ్ కూడా అకిరా నందన్‌కు మంచి ప్రమోషన్ చేస్తుంది. అతనేం చేసినా కూడా అమ్మ ఫుల్లుగా ప్రమోట్ చేస్తుంది. ఇప్పుడు కూడా జూనియర్ పవర్ స్టార్ ల్యాప్‌టాప్ ముందు బిజీ అయిపోయాడు. అక్కడేదో చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
తండ్రి పవన్ కళ్యాణ్‌తో అకిరా నందన్ (Akira Nandan)
తండ్రి పవన్ కళ్యాణ్‌తో అకిరా నందన్ (Akira Nandan)


దాన్ని ఫోటోలో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈ ఫోటో బాగా వైరల్ అవుతుంది. ల్యాపీ ముందు కాలు మీద కాలేసుకుని స్టైల్‌గా కూర్చుని ఏదో పని చేసుకుంటున్నాడు అకిరా నందన్. ఆయన పోజులు చూస్తుంటే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నట్లుగా అనిపిస్తుంది. ఇదే కామెంట్ పెడుతున్నారు నెటిజన్లు కూడా. ఈ ఫోటో కింద 'మై టాల్ ప్యాకేజ్ ఆఫ్ జాయ్' అంటూ కామెంట్ పెట్టింది రేణు దేశాయ్.
View this post on Instagram

. My tall package of joy🧡 . . #shotoniphone

A post shared by renu desai (@renuudesai) on


16 ఏళ్ల అకిరా నందన్ ప్రస్తుతం 6.4 అడుగులు దాటిపోయాడు. మెగా ఫ్యామిలీలో ఇప్పటి వరకు హైట్ అంటే వరుణ్ తేజ్ పేరు గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు పవన్ తనయుడు వరుణ్‌ను కూడా మించిపోయాడు. నువ్వు ఇంకా ఇలాగే ఎదగాలిరా నాన్న అంటూ అప్పట్లో చిరంజీవి కూడా ట్వీట్ చేసాడు. ప్రస్తుతం చదువుపైనే ఫోకస్ చేసిన అకిరా.. వీలైనంత త్వరగానే ఎంట్రీ ఇస్తాడేమో చూడాలిక. అయితే ఆయన ఎప్పుడొచ్చినా పవన్ తనయుడు అనే ఇమేజ్ మాత్రం శ్రీ రామరక్షలా ఉంటుందనడటంలో ఎలాంటి సందేహం లేదు.
Published by: Praveen Kumar Vadla
First published: July 14, 2020, 8:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading