హోమ్ /వార్తలు /సినిమా /

పవన్, ఆద్యలపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్... ఫోటో వైరల్..

పవన్, ఆద్యలపై రేణు దేశాయ్ ఆసక్తికర కామెంట్స్... ఫోటో వైరల్..

Instagram/renuudesai

Instagram/renuudesai

రేణూ దేశాయ్..  నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తోన్న విషయం తెలిసిందే.

రేణూ దేశాయ్..  నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక తన ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా నివసిస్తోన్న విషయం తెలిసిందే. అయితే నూతన సంవత్సరం సందర్భంగా పవన్ తన పిల్లల్ని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన అపురూపమైన ఫోటోను రేణూ దేశాయ్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్బంగా ఆమె ఆ పోస్ట్‌లో.. ఇది తండ్రీ కుమార్తెల ప్రేమని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘కొన్నిసార్లు ఆద్య చూడటానికి చాలా వరకు నాలాగా కనిపిస్తుంది. చాలా సార్లు తన నాన్నమ్మ, మరోసారి నాన్నకు కాపీలా ఉంటుంది. ఆద్య.. నా కెమెరా ఫేవరెట్‌ పర్సన్‌’ అంటూ రాసుకుంది. రేణూ దేశాయ్ ఈ ఫొటోను షేర్‌ చేసిన గంటలోనే 27 వేల మందికిపైగా లైక్‌ చేయడం ఇక్కడ విశేషం.  అది అలా ఉంటే ఆమె ఇటీవల తన కొడుకు అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని షేర్ చేశారు. 1, 2, 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా నంటూ ఆద్య, అకీరాను ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.. వారిద్దరూ తన సొంతం అంటూ రాసుకున్నారు రేణు దేశాయ్. దీనిపై పవన్ అభిమానులు విమర్శలు చేస్తూ కామెంట్స్ చేశారు. 'ఆ పిల్లలది ఎంతైనా పవన్ రక్తం కదా?' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.


అయితే, వారికి రేణూ దేశాయ్ కౌంటర్ ఇస్తూ...  సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తమే. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు' అని బదులిచ్చింది.  ఆశ్చర్యంగా రేణూ దేశాయ్ తాజాగా ఆద్య ఫోటో పోస్ట్ చేసి తన నాన్నలా ఉందని అనడం గమనార్హం.  రేణూ, పవన్‌‌లు 2009లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2012లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

First published:

Tags: Renu Desai, Telugu Movie News

ఉత్తమ కథలు