Home /News /movies /

RENU DESAI PLAY A INTERESTING ROLE IN RAVI TEJA MOVIE TIGER NAGESWAR RAO SB

Renu Desai: రవితేజ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. కీలక పాత్రలో రేణు దేశాయ్

రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య.

రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య.

రవితేజ కొత్త సినిమా చేస్తున్నారు. అయితే ఉగాది సందర్భంగా టైగర్ నాగేశ్వర్రావు సినిమా లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకకు ప్రముఖ నటి రేణుదేశాయ్ కూడా హాజరయ్యారు.

    పవన్ మాజీ భార్య.. నటి రేణుదేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొన్నేళ్ల నుంచి ఆమె నటనకు దూరంగా ఉంటున్నారు. జానీ తర్వాత ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. పవన్ కళ్యాన్‌తో పెళ్లి, పిల్లలు, ఆ తర్వాత విడుకులతో ఆమె కొన్నాళ్ల పాటు వెండి తెరకు దూరమయ్యారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నుంచి విడిపోయిన త‌ర్వాత పూణేలో కొడుకు అకీరా, కూతురుతో క‌లిసి ఉంటోంది రేణు. పిల్లలు మాత్రం హైద‌రాబాద్ వచ్చిన‌ప్పుడల్లా ప‌వ‌న్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి వెళుతుంటారు.   ఆ మ‌ధ్య కాలంలో రేణు ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. కానీ యాక్టింగ్ మాత్రం చేయ‌లేదు. అయితే ఇప్పుడు తాజాగా రేణు రీ ఎంట్రీకి రెడీ అవుతున్నారా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ అందుకు ఉదాహరణగా నిలిచింది.

    మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న కొత్త సినిమా టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఉగాది సంద‌ర్భంగా ఈ సినిమాను శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభించారు.అయితే ఈ లాంచింగ్ వేడుక‌కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అయితే మ‌రో ప్రముఖ వ్య‌క్తి ఈ వేడుక‌కు విచ్చేశారు. వారు మరెవరో కాదు.. రేణు దేశాయ్‌. ఈ సందర్భంగా రేణును చూసి చిరు నవ్వారు. అయితే టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు లాంఛింగ్ ఈవెంట్‌లో రేణు దేశాయ్ సినిమాల్లో రీఎంట్రీపై క్లారిటీ ఇచ్చేశారు. పాత్ర మంచిదిగా అనిపిస్తే రేణు దేశాయ్ న‌టిస్తారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు. ఈ సినిమాతో ఆమె వెండితెర‌పై రీ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘‘నాకు యాక్ట్ చేయాలని, సిల్వర్ స్క్రీన్‌పై క‌నిపించాల‌నే ఆలోచ‌నే లేదు.

    కానీ 2019లో డైరెక్ట‌ర్ వంశీ న‌న్ను క‌లిసి టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమా గురించి చెప్పారు. అందులో నా పాత్రను బాగా డిజైన్ చేశారు. వంశీగారి క‌న్విక్ష‌న్ నాకు బాగా న‌చ్చింది. వంశీ త‌ప్ప‌కుండా చాలా పెద్ద డైరెక్ట‌ర్ అవుతాడు’’ అన్నారు రేణు. అయితే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో రేణు దేశాయ్ ఎలాంటి పాత్ర చేయనుందో మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఆమె ఈ సినిమాలో ర‌వితేజ సోద‌రి పాత్ర‌లో క‌నిపిస్తార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. 1970 ద‌శకంలో స్టువ‌ర్టుపురం ప్రాంతంలో పేరు మోసిన గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు క‌థ‌ను ఆధారంగా చేసుకుని డైరెక్ట‌ర్ వంశీ ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ అగ‌ర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇది ర‌వితేజ‌కి తొలి పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Pawan kalyan, Ravi Teja, Renu Desai, Tollywood

    తదుపరి వార్తలు