news18-telugu
Updated: November 27, 2020, 5:53 PM IST
రేణు దేశాయ్ (Instagram/Photo)
Renu Desai | ప్రముఖ నటి రేణు దేశాయ్.. ప్రేమ విషయంలో మరోసారి తన అభిప్రాయాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. రేణు దేశాయ్ విషయానికొస్తే.. నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై మౌనం దాల్చింది. అసలు ఆ ఊసే ఎత్తడం లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులకు భయపడిపోయి.. రెండో పెళ్లి విషయంలో సైలెంట్ అయిపోయినట్టు సమాచారం. ఈ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. మధ్యలో రేణు దేశాయ్.. ఓ టీవీ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత రేణు దేశాయ్.. సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి.
రేణు దేశాయ్.. సినిమాల్లో కాకుండా.. వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా ఈమె ప్రేమ విషయమైన తన అభిప్రాయాలను వెల్లడించింది. లవ్ లో ఫెయిల్ అయినంత మాత్రానా.. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సరికాదన్నారు. చాలా రోజుల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి అభిమానులతో చిట్‌చాట్ చేసింది. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలను ఇచ్చింది. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతూ.. ప్రేమలో విఫలమైనంత మాత్రానా జీవితాన్ని అంతం చేసుకోవడం అనేది మూర్ఖత్వం. లవ్ ఫెయిల్యూర్ అయితే.. ఎంత బాధ కలుగుతుందో ఆ పెయిన్ నాకు తెలుసు అంటూ చెప్పుకొచ్చింది.

రేణు దేశాయ్ (Instagram/Photo)
మనం ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినపుడు చాలా బాధగా ఉంటుందంటూ ఇన్ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌తో తన విడాకుల గురించి ప్రస్తావించింది. అలాంటివి ఎదురైనపుడు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం ప్రాణం కంటే ఎవరూ ఎక్కువ కాదు. కౌన్సిలింగ్ తసీుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ సాయంతో సులభంగా ఆ పెయిన్ నుంచి బయటపడొచ్చని రేణు సూచించారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 27, 2020, 5:53 PM IST