రేణు దేశాయ్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్..

Renu Desai Pawan Kalyan: రేణు దేశాయ్.. ఈ పేరుతో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. అంతగా ఈ ఇద్దరి రిలేషన్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. మొదటి భార్యకు విడాకులు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 15, 2020, 7:21 PM IST
రేణు దేశాయ్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వని పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్
  • Share this:
రేణు దేశాయ్.. ఈ పేరుతో పాటు పవన్ కళ్యాణ్ పేరు కూడా ఆటోమేటిక్‌గా గుర్తొస్తుంది. అంతగా ఈ ఇద్దరి రిలేషన్ కొన్నేళ్ల పాటు కొనసాగింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత దాదాపు పదేళ్ల పాటు కలిసున్నారు పవన్, రేణు దేశాయ్. సహజీవనం చేసిన తర్వాత 2009లో పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల తర్వాత విడిపోయారు. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత ఆయన పేరు ఎత్తకుండా సోలోగా బతికేస్తుంది రేణు దేశాయ్. అంతేకాదు తన పిల్లల బాధ్యతను కూడా తీసుకుంది. ఒంటరిగానే ఉంటూ లైఫ్ లీడ్ చేస్తుంది రేణు దేశాయ్. ఈ క్రమంలోనే ఈమె కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీడియా ముందు చెప్పింది.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)


ముఖ్యంగా అప్పట్లో పవన్ రిలేషన్ గురించి కూడా చెప్పుకొచ్చింది ఈమె. అన్నింటికి మించి తాను కేవలం నటిగా మాత్రమే అందరికీ తెలుసు కానీ తనలో ఎడిటర్ కూడా ఉందని చెప్పుకొచ్చింది రేణు. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలకు ఈమె ఎడిటర్ కూడా. అయితే పేరు పడలేదు కాబట్టి ఎవరికీ తెలియదంతే. దాంతో పాటు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా వర్క్ చేసింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటికి వచ్చింది.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)


ఖుషీ సినిమాలోని ఏ మేరా జహా పాట అందరికీ తెలుసు.. దర్శకుడు ఎస్‌జే సూర్య ఈ పాటను 20 నిమిషాల రష్ షూట్ చేసాడని తెలిపింది రేణు. దాన్ని 5 నిమిషాలకు కట్ చేయడానికి ఎడిటర్ మార్తండ్ కే వెంకటేష్ ట్రై చేస్తుంటే.. హిందీ తెలిసిన తను ఆ పాటను 5 నిమిషాల వరకు ఎడిట్ చేసానని చెప్పుకొచ్చింది. అప్పుడు తనకు వచ్చిన డబ్బులు.. ఇచ్చిన రెమ్యునరేషన్ జీరో అని తెలిపింది రేణు.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)


అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎప్పుడు పని చేసినా కూడా తనకు వచ్చిందేమీ లేదని చెప్పింది ఈమె. ఆన్ కెమెరా చెప్తున్నాను.. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇవ్వలేదని ఓపెన్ స్టేట్‌మెంట్స్ ఇచ్చింది రేణు దేశాయ్. పవన్‌తో కలిసున్నపుడు ఆయన నటించిన సినిమాలకు చాలా వరకు ఎడిటర్‌గా కూడా వర్క్ చేసింది రేణు. కానీ ఫ్రీగానే చేసానని చెప్పుకొచ్చింది ఈమె. పేరు కూడా పడలేదు కాబట్టి ఎవరికీ తన టాలెంట్ తెలియదని చెప్పింది ఈమె.
First published: April 15, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading