మహేష్ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తోందా.. ఇదిగో క్లారిటీ..

సర్కారు వారి పాట చిత్రంలో ఓ కీలక పాత్రలో రేణు దేశాయ్ నటిస్తోందంటూ ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: June 29, 2020, 10:45 AM IST
మహేష్ సినిమాలో రేణు దేశాయ్ నటిస్తోందా.. ఇదిగో క్లారిటీ..
మహేష్, రేణు దేశాయ్ Photo : Twitter
  • Share this:
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఈ విషయమై తాజాగా రేణు దేశాయ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. తాను ఎలాంటీ పాత్ర చేయట్లేదని.. తాను విన్న అతి పెద్ద రూమర్ ఇదేనంటూ పేర్కోంది. ఈ విషయంపై గత రెండు మూడు రోజులుగా తనకు చాలా మంది ఫోన్ చేసి అభినందనలు చెబుతున్నారని.. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని.. ఇంత పెద్ద చిత్రంలో తనకు నటించే అవకాశం వస్తే.. తానే ప్రకటన చేసుండేదాన్నని పేర్కోంటూ తనకు కూడా నటించాలని ఉందని తాజాగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆమె ఆ వార్త జస్ట్ ఓ రూమర్ మాత్రమే అంటూ కొట్టిపడేశారు. ఇక తన కుమారుడు అకీరా సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు తనకు 16 ఏళ్లు మాత్రమేనని పేర్కోంటూ.. అకీరా.. ఏ వృత్తిని ఎంచుకున్నా, ఓ తల్లిగా ప్రోత్సహిస్తానని, సినిమాల్లోకి వస్తానన్న కూడా అతని ఇష్టమేనని.. దానికి నీను అడ్డు చెప్పనంటూ తెలిపింది.

ఇక సర్కారు వారి పాట పేరుతో వస్తోన్న ఈ సినిమాలో అవినీతికి సంబంధించిన ఓ సామాజిక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని హీరో మహేష్ ఎలా తిరిగి రాబట్టాడు. దానికి సంబందించి ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది ఈ సినిమా కథగా తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.
First published: June 29, 2020, 10:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading