దయచేసి పవన్ కళ్యాణ్‌కు నాకు గొడవలు పెట్టకండి.. రేణు దేశాయ్ ఎమోషనల్..

రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. తాజాగా రేణు దేశాయ్ మరోసారి ఎమోషనల్ అయింది.

news18-telugu
Updated: February 14, 2020, 7:57 PM IST
దయచేసి పవన్ కళ్యాణ్‌కు నాకు గొడవలు పెట్టకండి.. రేణు దేశాయ్ ఎమోషనల్..
పనవ్ కళ్యాణ్,రేణు దేశాయ్ (Twitter/Photo)
  • Share this:
రేణు దేశాయ్ ఒక నటిగా కంటే పవన్ కళ్యాణ్ రెండో భార్యగానే అందరికీ పరిచయం. 2011లో పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణెలో ఉంటోంది. ఈ మధ్యనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి సంచలనం రేపిన రేణు దేశాయ్..ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ విషయమై సెలెంట్ అయిపోయింది.ఆ మధ్య మరాఠిలో తన కొడుకు అకిరానందన్ ముఖ్యపాత్రలో ‘ఇష్క్ వాలా లవ్’ అనే సినిమాను కూడా డైరెక్ట్ చేసింది రేణు దేశాయ్. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా రేణు దేశాయ్ హైదరాబాద్‌లో ఓ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది. ఇది ఆమె మాజీ భర్త జనసేనాని పవన్ కళ్యాణ్ కొనిచ్చాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై రేణు దేశాయ్ కాస్తా ఘాటుగానే స్పందించింది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో కొన్న ప్లాట్ తన కష్టార్జితంతో కొనుక్కొన్నట్టు దానికి తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు ఎటువంటి సంబంధము లేదని వివరణ ఇచ్చింది.


నిన్నటి నుంచి నాకు మీడియా నుంచి స్నేహితుల నుంచి ఎన్నో మెసెజ్‌లతో పాటు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వార్త విని నేను ఎంతో బాధ పడ్డాను. నేను నా లైఫ్ కోసం ఇప్పటికీ  ఒంటరిగానే శ్రమిస్తూనే ఉన్నాను. నేను ఇప్పటి వరకు మా తండ్రి నుంచి కూడా ఏరకమైన ఆర్థిక సహాయము తీసుకోలేదు. అలాగే తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ నుంచి అన్యాయముగా ఎలాంటి భరణాన్ని కోరలేదు అంటూ వివరణ ఇచ్చిది. అది నా వ్యక్తిత్వం. అయినప్పటికీ మీరు నా గురించి అన్యాయంగా అన్యాపదేశంగా రాసే రాతగాళ్లపై కాస్తా గట్టిగానే ఇచ్చుకుంది.

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (Pawan Kalyan Renu Desai)


ప్రచారం చేస్తున్నట్టూ ఇపుడు హైదరాబాద్‌లో మా ఫ్లాట్ నిజంగా మాకెరు కొనివ్వలేదు. ఇది నా సొంత పైసలతో ఎంతో కష్టపడి కొనుక్కొన్నాను. ఇలాంటి వార్తల వల్ల నా నిజాయితీకి ఆత్మగౌరవానికి భంగం కలుగుతుందన్న కాస్త ఇంగిత జ్ఞానం మీకు రాలేదా నాకు తెలిసినంత వరకు ఈ వార్తకు నా మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి సంబంధం లేదు. ఇకనైనా ఏదైనా వార్త రాస్తే ఒకటికి రెండు సార్లు తరిచి చూసి రాస్తే బాగుంటుందని చెప్పుకొచ్చింది.
First published: February 14, 2020, 7:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading