పవన్ కళ్యాణ్ అభిమానిపై ఫైర్ అయిన రేణు దేశాయ్..

Renu Desai: రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది ఈమె.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 20, 2020, 10:46 PM IST
పవన్ కళ్యాణ్ అభిమానిపై ఫైర్ అయిన రేణు దేశాయ్..
పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ (pawan renu desai)
  • Share this:
రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంది కానీ ప్రేక్షకులకు మాత్రం కాదు. ఎప్పటికప్పుడు తన అభిప్రాయలను అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూనే ఉంటుంది ఈమె. ఇక ఇప్పుడు తన తొలి సినిమా.. పవన్ కళ్యాణ్‌ను తన జీవితంలోకి తీసుకొచ్చిన సినిమా బద్రి విడుదలై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా నాటి జ్ఞాపకాలను ఈ నటి గుర్తు చేసుకుంది. ఈ సందర్భంగానే కొన్ని విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సినిమా తనకు రెండు తీపి బహుమతులను ఇచ్చిందని చెప్పింది. వాళ్లే ఆద్య, అకీరా అంటూ తన పిల్లల గురించి చెప్పుకొచ్చింది. కానీ పవన్ గురించి మాత్రం ఏం మాట్లాడలేదు రేణు.


అంతేకాదు బద్రి షూటింగ్ ముచ్చట్ల గురించి కూడా చెబుతూ ఫోటోలను కూడా షేర్ చేసింది రేణు దేశాయ్. అయితే ఇప్పుడు రేణు దేశాయ్ పోస్ట్ చూసిన పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు ఈమెపై కాస్త సెటైర్లు వేసాడు. ఈ రేణుదేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది. అవసరమా ఇప్పుడు... ఆ మధ్య చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మళ్లీ ఈ పోస్ట్లు ఎందుకు? ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా... ఆ విషయం ఏమైంది? అంటూ పోస్ట్ చేసాడు. ఇది చూసిన రేణు వెంటనే స్పందించింది. ఈ స్క్రీన్ షాట్ ఇప్పుడు నాకు వచ్చింది అంటూ రేణు ఆన్సర్ ఇచ్చింది.

అవసరమా... అంటే అవును అవసరం. బద్రీ వచ్చి నేటికి 20 ఏళ్లు. ఈ సినిమాను చాలామంది మరిచిపోయారు. కాని ఇది నా మొదటి సినిమా. నాకు చాలా చాలా స్పెషల్. ఇంత ద్వేషం ఎందుకు అన్నా.. మనం ఇప్పటికే ఈ కరోనా వైరస్ వల్ల చాలా కష్టాల్లో ఉన్నాం. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అందరి కోసం కాస్త మంచిగా ఆలోచించండి అంటూ క్లియర్‌గా అందరికీ అర్థమయ్యేలా తెలుగులో రాసుకొచ్చింది రేణు దేశాయ్. తన జ్ఞాపకాలను పంచుకోవడం కూడా తప్పుగా అనిపిస్తుంది కొందరికి అంటూ ఫైర్ అయిపోయింది రేణు దేశాయ్.
First published: April 20, 2020, 10:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading