• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RENU DESAI FIRE ON NETIZEN WHO COMMENTS NEGATIVE ON HER NR

Renu Desai: రేణుదేశాయ్ వేలికి ఉంగరం.. ఆ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు?

Renu Desai: రేణుదేశాయ్ వేలికి ఉంగరం.. ఆ రింగ్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరు?

Renu Desai

Renu Desai: తెలుగు సినీ నటి రేణు దేశాయ్. రేణు దేశాయ్ గురించి ఒక హీరోయిన్ గా కాకుండా.. పవన్ కళ్యాణ్ భార్యగా మాత్రం అందరికీ పరిచయం. ఇక ఈమె పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత

  • Share this:
    Renu Desai: తెలుగు సినీ నటి రేణు దేశాయ్. రేణు దేశాయ్ గురించి ఒక హీరోయిన్ గా కాకుండా.. పవన్ కళ్యాణ్ భార్యగా మాత్రం అందరికీ పరిచయం. ఇక ఈమె పవన్ కళ్యాణ్ తో విడిపోయిన తర్వాత.. తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఇక పూర్తిగా పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత.. 2018 లో మరో వ్యక్తితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ రింగ్ ధరించిన ఫోటో కూడా షేర్ చేసుకుంది.

    అంతేకాకుండా ఆ ఫోటో కు ఓ కవితను కూడా షేర్ చేయగా.. తన కాబోయే వాడితో చేతిలో చెయ్యేసి ఎంగేజ్మెంట్ రింగ్ కనిపించేటట్టు ఫోటో పంచుకుంది. ఇక ఆ తర్వాత పెళ్లి ఎప్పుడాని.. తెగ ప్రశ్నలు ఎదురవ్వగా పెళ్లి గురించి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి విషయాన్ని కూడా తెలపలేదు. ఇక అప్పటి నుంచి అభిమానులు కూడా ఆ మాటని తీయకుండా ఉండగా.. తాజాగా మరో రింగ్ పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసి మళ్లీ అందరినీ ఆశ్చర్యపరిచింది.

    సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇక తన పిల్లల గురించి, తన గురించి ఏదో ఒక విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. ఇక తాజాగా తన చేతి ఫోటో షేర్ చేయగా.. అందులో మరో రింగ్ కనిపించగా ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది. అంతేకాకుండా ఆ ఫోటోకు ' నాకు ఈ ప్రపంచంతో పనిలేదు.. ఫీల్ హ్యాపీనింగ్' అంటూ జత చేయగా ఈ విషయం గురించి అభిమానులు తెగ ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ఈ రింగ్ తో పాటు.. తాను గతంలో ధరించిన ఎంగేజ్మెంట్ రింగ్ కూడా ఉండగా.. అభిమానులలో రేణు దేశాయ్ పెళ్లి గురించి మళ్లీ వార్తలు వినిపిస్తున్నారు.

    renu desai
    renu desai


    ఈ ఫోటో రేణు దేశాయ్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయగా.. నెటిజనులు రక రకాలుగా స్పందించగా.. ఓ నెటిజెన్ మాత్రం 'ఈ రింగ్ పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇచ్చాడనే నా ఆలోచన' అంటూ కామెంట్ చేయగా.. వెంటనే రేణుదేశాయ్ స్పందించింది. ఆ రింగ్ తన సొంత డబ్బులతో కొన్నానంటూ తెలుపగా, తన భర్త పవన్ కళ్యాణ్ తన నుండి విడాకులు తీసుకున్నాక కూడా ఎందుకు ఆ రింగు ఇస్తాడని ఆ నెటిజన్ పై మండిపడింది. కాగా ప్రస్తుతం ఈ కామెంట్ ఫోటో వైరల్ గా మారింది.
    Published by:Navya Reddy
    First published:

    అగ్ర కథనాలు