Home /News /movies /

RENU DESAI EMOTIONAL IN DRAMA JUNIORS ABOUT HER FATHER AVOIDED WHEN SHE IS BORN NR

Renu Desai: ఆడపిల్లా పుట్టిందని అతను నా మొహం కూడా చూడలేదు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్స్!

Renu Desai

Renu Desai

Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అంతేకాకుండా ఈమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది.

    Renu Desai: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అంతేకాకుండా ఈమె తెలుగు సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా.. కొన్ని కారణాల వల్ల పవన్, రేణూ విడిపోయారు. ఇక అప్పటి నుంచి తన పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న రేణూ..తన పిల్లలని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు చాలాసార్లు పరిచయం చేసింది.

    ఇక ప్రస్తుతం రేణు దేశాయ్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న డ్రామా జూనియర్స్ ప్రోగ్రాం లో జడ్జిగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ షో లో తన కూతురు ఆద్యా కూడా తొలిసారిగా బుల్లితెరపై అడుగు పెట్టింది. ఇక తను కూడా తన అమ్మ గురించి తాను ఎప్పుడు బెస్ట్ అంటూ అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మరో ప్రోమో విడుదల కాగా.. అందులో రేణు దేశాయ్ మళ్లీ ఎమోషనల్ గా ఫీల్ అయింది.

    ప్రోమోలో ఓ స్కిట్ లో ఆడపిల్ల పుట్టిందని భర్త తన భార్యను హింసిస్తాడు. బాబు పుట్టాడు అనుకుంటే పాప పుట్టింది అంటూ.. పాపని వదిలేయ్.. లేదా నన్ను వదిలే అంటూ సీన్ చూపించగా.. అందులో రేణు దేశాయ్ తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. తనకంటే ముందు అక్క పుట్టిందని.. ఆ తర్వాత తను పుట్టాను అంటూ తెలపగా.. మళ్లీ ఆడపిల్ల పుట్టిందని తన తండ్రి తన మొహం కూడా చూడలేదు అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ తో తెలిపింది. తన మాటలతో అక్కడున్నవారంతా సైలెంట్ అయిపోగా.. తన పక్కనే ఉన్న తన కూతురు ఆద్యా కూడా తనను ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక ఈ ప్రోగ్రాం ఈ ఆదివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Adya, Akhira nanda, Drama Juniors, Gender bias, Mother day, Pawan kalyan, Renu Desai, Zee telugu

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు