RENU DESAI EMOTIONAL COMMENTS ON HER SON AKIRA NANDAN SLB
Renu Desai: అకీరాకు అదొక్క మాట చెప్పా..! పవన్ మాజీ భార్య ఎమోషనల్ కామెంట్స్
Photo Twitter
పవన్, రేణులతో పాటు వారి కుమారుడు అకీరా నందన్, ఆధ్య ఉన్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. చాలా రోజుల తర్వాత ఇది పవన్ అభిమానులకు పట్టలేని నయనానందాన్ని కలిగించింది. ఈ పిక్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మురిసిపోతూ తెగ షేర్ చేసుకుంటున్నారు. ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణూ ఎమోషనల్ మెసేజ్ పెట్టారు.
గత రాత్రి నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అయన భార్య రేణూ దేశాయ్ (Renu Desai) ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో పవన్, రేణులతో పాటు వారి కుమారుడు అకీరా నందన్ (Akira Nandan), ఆధ్య (Aadhya) ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఇది పవన్ అభిమానులకు పట్టలేని నయనానందాన్ని కలిగించింది. ఈ పిక్ చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) మురిసిపోతూ తెగ షేర్ చేసుకుంటున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడా చూసిన ఇదే ఫొటో దర్శనమిస్తోంది. అయితే ఈ ఫొటోని తన ఇన్స్‌స్టాగ్రామ్ (Instagram) ఖాతాలో షేర్ చేసిన రేణూ దేశాయ్.. అకీరా నందన్ గురించి కామెంట్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ పాస్ చేశారు. నా కొడుకు చూస్తుండగానే పెద్దవాడయ్యాడు.. అకీరాకు అదొక్క మాట చెప్పా అంటూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో (Indus International School) అకీరా నందన్ (Akira Nandan) తన స్కూల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఫేర్వెల్ కార్యక్రమంలో రేణు దేశాయ్, ఆధ్య సహా పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ముగ్గురూ కలిసి ఫోటోకి పోజిచ్చారు. ఈ ఫొటోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ''ఒక శకం ముగుస్తుంది మరో ఒక శకం ప్రారంభమవుతుంది. అకీరా గ్రాడ్యుయేషన్ పూర్తయిన రోజున అతని తల్లిదండ్రులుగా గర్వపడుతున్నాం. ఇక ఉదయాన్నే పాఠశాలకు సిద్ధం కావాల్సిన అవసరం లేదు, బస్ టైమ్ అవుతుందనే టెన్షన్ అవసరం లేదు, లంచ్ ప్రిపేర్ చేయడానికి తొందర పడాల్సిన పనిలేదు. ఇప్పుడే నిజమైన ప్రయాణం మొదలైందని అకీరాకు చెప్పాను. తల్లిదండ్రుల షైన్ అనేది అవసరం లేకుండా అతడే సొంతంగా కెరీర్ బిల్డ్ చేసుకుంటాడని నమ్ముతున్నా'' అని రేణు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్- రేణూ దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలు అకీరా, ఆధ్య పుట్టాక కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని విడివిడిగా ఉంటున్నారు. అప్పటినుంచి పిల్లలిద్దరి పూర్తి భాద్యత రేణూ చూసుకుంటున్నారు. కంటికి రెప్పలా చూసుకుంటూ వారిని కాపాడుతూ వచ్చారు రేణు.
కాగా గత కొన్ని రోజులుగా అకీరా సినీ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. త్వరలోనే అకీరా కెమెరా ముందుకొస్తారని, ఇందుకోసం లోలోపల ప్రయత్నాలు నడుస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ తల్లిదండ్రుల నేమ్, ఫేమ్ అవసరం లేకుండా అకీరానే స్వయంగా షైన్ కావాలని రేణూ దేశాయ్ కోరుకోవడం చర్చనీయాంశం అయింది. సో.. ఒకవేళ అకీరా సినిమాల్లోకి వచ్చినా మెగా ట్యాగ్ పెద్దగా అవసరం లేదని రేణూ చెప్పకనే చెప్పిందంటూ కామెంట్స్ వినబడుతున్నాయి. అకీరాకు నటనపై ఆసక్తి లేదని గతంలో ఓ సందర్భంలో ఓపెన్ అయ్యారు రేణూ దేశాయ్.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.