కొన్ని వార్తలు వింటానికి చాలా క్రేజీగా ఉంటాయి. అయితే వాటిల్లో నిజమెంత అనేది అనుమానస్పదంగానే ఉంటాయి. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి సంబంధించిన సంగతులు గత కొంతకాలంగా బాగా వైరల్ అవుతున్నాయి. పింక్ రీమేక్ షూటింగ్ మొదలైన రెండు నెలల్లోనే ఓ ఆసక్తికరమైన రూమర్ బయటికి వచ్చింది. సినిమాలో పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా నటిస్తున్నారు అని వార్తలు గతకొంత కాలంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే దీనిపై తనంతట తానే రేణూ దేశాయ్ స్పందించలేదు. తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో రేణు ఓ ఫొటో పోస్ట్ చేయడంతో ఓ పవన్ అభిమాని ఇదే సరైన సమయం అనుకుని ‘వదినమ్మా మీరు పింక్ రీమేక్‌లో నటిస్తున్నారంట నిజమేనా?’ అని ప్రేమగా అడిగాడు. ఇందుకు రేణూ స్పందిస్తూ.. ‘లేదండీ ఫాల్స్ న్యూస్’ అని క్లారిటీ ఇచ్చేసారు. దీంతో పవన్ సినిమాలో రేణుని చూడాలకున్న అభిమానులు నిరాశ చెందుతున్నారు.ఇదిలా ఉంటే.. తనకు పవన్ కళ్యాణ్ ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనిపెట్టారని వార్తలు రాగా వాటిని గట్టిగా తిప్పికొట్టింది రేణు. తను స్వతంత్రంగా తన కాళ్ళ మీద నిలబడుతున్నానని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయొద్దని తెలుపుతూ సందేశమిచ్చింది.
త్రివిక్రమ్‌తో చేసిన 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి ముఖానికి రంగేసుకున్నారు. ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు చేస్తూ ఆ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నారు. బాలీవుడ్ మూవీ 'పింక్' సినిమా తెలుగు రీమేక్‌తో పవన్ ఎంట్రీ ఫిక్స్ అయింది. మరోవైపు ఈ సినిమాకి ‘లాయర్ సాబ్’, లేదా ‘వకీల్ సాబ్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. వీటితో పాటు క్రిష్ దర్శకత్వంలో పండగ సాయన్న అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. దాంతో పాటు హరీష్ శంకర్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో మరో సినిమాకు కమిటయ్యాడు. వీటితో పాటు బాబీ, డాలీ సినిమాలను కూడా లైన్లో పెట్టాడు. మొత్తంగా సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో బిజీ కావడం చేసి పవన్ కళ్యాణ్ అభిమానులు ఖుషీ చేసుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Pink, Renu Desai, Telugu Cinema, Tollywood