Home /News /movies /

RENU DESAI BIG SHOCK TO PAWAN KALYAN IN AKIRA NANDAN ISSUE SB

Pawan Kalyan: అకీర విషయంలో.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ ఇచ్చిన రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ ,రేణు దేశాయ్

స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలలో అకీరా నందన్ RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించి అందరినీ ఆకర్షించాడు, అయితే ఇదే సమయంలో ఆయన పాట ప్లే చేస్తున్న క్రమంలో ఆయన పేరు స్క్రీన్ల మీద చూసి షాక్ తిన్నారు.

  పవర్ స్టార్ పవన్ కళ్యాన్(Pawan Kalyan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ అంటే పడిచచ్చే ఫ్యాన్స్ ఎందరో ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయంలో అయినా... ఇట్టే అభిమానులు వైరల్ చేస్తుంటారు. పవన్‌తో పాటు.. ఆయన కుటుంబ సభ్యుల్ని కూడా ఆరాధిస్తుంటారు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గురించి కూడా మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్,రేణు దేశాయ్ విడాకులు తీసుకొని గత కొన్నేళ్లుగా ఎవరికి వారు వేరు వేరుగా బతుకుతున్నారు. అయితే వీరిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు అకీరా, కూతరు ఆద్య... పిల్లలిద్దరూ రేణుతోనే ఉంటున్నారు. మొదటి విశాఖపట్నానికి చెందిన ఒక యువతిని వివాహమాడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆమె నుంచి విడిపోయి కొన్నాళ్లపాటు సినిమాల మీద దృష్టి పెట్టారు, అదే సమయంలో రేణు దేశాయ్ పరిచయం కావడంతో ఆమెతో సహజీవనం చేశారు. అయితే రాజకీయాలకు ఇబ్బంది అవుతుందని భావించి ఎట్టకేలకు ఆమెను వివాహమాడారు.

  2009లో పవన్, రేణు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పటికే ఆమెకు పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా నందన్, ఆద్యా అనే ఇద్దరు చిన్నారులు కూడా జన్మించారు. అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ల మధ్య విభేదాలు రావడంతో వారు విడాకులు కూడా తీసుకున్నారు. వివాహం చేసుకున్న మూడేళ్లకే ఈ జంట విడిపోయింది. 2012లో వీరిద్దరూ విడాకులు (Divorce) తీసుకున్నారు. అయితే ఆ తర్వాత పవన్ పెద్దగా రేణు ఇంటికి వెళ్లింది లేదు. ఎక్కడా రేణు దేశాయ్‌(Renu desai)ను కలిసింది లేదు. అయితే రేణు దేశాయ్ తన పిల్లలను భర్తను విడదీయాలని అనుకోలేదు. అందుకే ఎప్పుడు పవన్ కళ్యాణ్ తన బిడ్డలను చూడాలనుకున్నా, పిల్లలు తమ తండ్రిని చూడాలనుకున్నా ఎలాంటి అడ్డు లేకుండా కలుస్తున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ తో మాత్రమే కాదు రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్ సహా మెగా ఫ్యామిలీ లో అందరితో అకిరా నందన్, ఆద్యలకు మంచి రిలేషన్ ఉంది.

  అయితే తాజాగా పవర్ స్టార్ తన మాజీ భార్య రేణుదేశాయ్‌తో క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అది ఏమిటి అంటే అకీరా నందన్ పవన్ కళ్యాణ్ వారసుడిగా కాకుండా రేణు దేశాయ్ వారసుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని, తన తండ్రి ఇంటి పేరు వదులుకుని తల్లి ఇంటి పేరునే స్వీకరించాడు అని తెలుస్తోంది.
  ఇప్పటివరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అకీరా నందన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు గానే భావిస్తున్నాను. అయితే ఇటీవల ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలలో అకీరా నందన్ RRR సినిమాలోని దోస్తీ పాటకు పియానో వాయించి అందరినీ ఆకర్షించాడు, అయితే ఇదే సమయంలో ఆయన పాట ప్లే చేస్తున్న క్రమంలో ఆయన పేరు అకీరా నందన్ కొణిదెల అని కాకుండా అకీరా నందన్ దేశాయ్ అని అక్కడి స్క్రీన్ల మీద దర్శనం ఇచ్చిందట.

  అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, కానీ అవి నిజమేనా లేక ఎడిట్ చేయబడ్డాయా అనే విషయం మీద కూడా క్లారిటీ లేదు. అయితే ఇలా వైరల్ అవుతున్న ఫోటోల విషయంలో మెగా ఫ్యాన్స్ కాస్త బాధపడుతున్నారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ రేణుదేశాయ్ కు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో పవన్ కళ్యాణ్ ఒక్కడికే అంత క్రేజ్ ఉంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే పవన్ కళ్యాణ్ వారసుడిగా అకిరా నందన్ ఎప్పుడో తెర మీదకు వచ్చాడు కానీ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ వారసుడిగా నిలబడతాడా లేదా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Akira nandan, Mega Family, Pawan kalyan, Renu Desai

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు