Hyper Aadi: నేను ఈ ఫీల్డ్ లోకి రావడానికి కారణం ఆ అమ్మాయే.. రివీల్ చేసిన హైపర్ ఆది

జబర్దస్త్ 400వ ఎపిసోడ్ (jabardasth 400th episode)

Hyper Aadi: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు హైపర్ ఆది గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈటీవీలో ప్ర‌సారం అయ్యే ప్ర‌ముఖ కామెడీ షో జబర్ద‌స్త్ ద్వారా హైప‌ర్ ఆది మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నారు. అందులో ఆది వేసే పంచ్‌లు వీక్ష‌కుల‌ను బాగా ఆట్టుకుంటాయి. కేవ‌లం సామాన్య ప్రేక్షకులే కాదు.. సినిమా సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారారు.

  • Share this:
    Hyper Aadi: తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు హైపర్ ఆది గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈటీవీలో ప్ర‌సారం అయ్యే ప్ర‌ముఖ కామెడీ షో జబర్ద‌స్త్ ద్వారా హైప‌ర్ ఆది మంచి ఫేమ్‌ని సంపాదించుకున్నారు. అందులో ఆది వేసే పంచ్‌లు వీక్ష‌కుల‌ను బాగా ఆట్టుకుంటాయి. కేవ‌లం సామాన్య ప్రేక్షకులే కాదు.. సినిమా సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారారు. ఇక ప‌లు సినిమాల్లో న‌టించ‌డంతో పాటు కొన్నింటికి డైలాగ్‌లు కూడా అందించాడు హైప‌ర్ ఆది. ఇదిలా ఉంటే తాజాగా త‌న క్ర‌ష్ గురించి హైప‌ర్ ఆది వెల్ల‌డించారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఈటీవీ ప్ర‌త్యేక షోల‌ను క‌చ్చితంగా చేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలో వాలంటైన్స్ డే సంద‌ర్భంగా రెండు గంట‌ల్లో ప్రేమించ‌డం ఎలా అనే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ప్ర‌సారం చేయ‌బోతోంది.

    దానికి సంబంధించిన మ‌రో ప్రోమో తాజాగా విడుద‌ల అయ్యింది. అందులో త‌న క్ర‌ష్ గురించి రివీల్ చేశాడు హైప‌ర్ ఆది. తొమ్మిదో త‌ర‌గ‌తిలో త‌నంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు త‌న‌కు పెళ్లి అయ్యి ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. కానీ ఈ ఫీల్డ్‌లోకి రావ‌డానికి మాత్రం కార‌ణం త‌నే అని చెప్పుకొచ్చాడు.

    మ‌రోవైపు ఇమ్మాన్యుల్ త‌న కుటుంబాన్ని వీక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశాడు. ఈ సంద‌ర్భంగా త‌న సోద‌రుడు త్యాగం చేస్తేనే తాను ఈ స్టేజ్ మీద ఉన్నాన‌ని భావోద్వేగానికి గురయ్యాడు. మ‌రోవైపు ఇమ్మాన్యుల్ తండ్రి మాట్లాడుతూ.. మా వాడు మాకు చెడ్డ పేరు తెస్తాడేమో అనుకునే వాడిని, కానీ వాడు మ‌మ్మ‌ల్ని ఈ స్టేజ్‌కి తీసుకొస్తాడ‌ని అనుకోలేదు అంటూ ఎమోష‌న‌ల్ అయ్యారు. ఇక ఇమ్మాన్యుల్ మాట్లాడే స‌మ‌యంలో వ‌ర్ష కూడా భావోద్వేగానికి గుర‌య్యారు. కాగా డ్యాన్స్ మాస్ట‌ర్ పండు.. త‌న త‌ల్లి, త‌న ల‌వ‌ర్ చ‌నిపోయిన విష‌యాన్ని గుర్తు చేసుకోగా.. మ‌రో డ్యాన్స్ మాస్ట‌ర్ మనోజ్.. నేనేం త‌ప్పు చేయ‌లేదు. ఇప్ప‌టికీ నీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నా అని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.
    Published by:Manjula S
    First published: