RELANGI NARASIMHA RAO SAYS ABOUT HIS INCIDENT WITH ALI IN ALITHO SARADAGA SHOW NR
Alitho Saradaga: ఆ పని చేసినందుకు అందరి ముందు చెంపదెబ్బ తిన్న డైరెక్టర్.. ఎవరంటే?
Alitho Saradaga
Alitho Saradaga: సినీ ఇండస్ట్రీలో నటులకైనా లేదా దర్శకనిర్మాతలకైనా కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఏదో ఒక సందర్భాలలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. వాటిని చాలామంది బయటపెట్టరు కానీ కొన్ని సందర్భాలలో బయట పెడుతుంటారు.
Alitho Saradaga: సినీ ఇండస్ట్రీలో నటులకైనా లేదా దర్శకనిర్మాతలకైనా కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోకుండా ఏదో ఒక సందర్భాలలో చిన్న చిన్న గొడవలు జరుగుతుంటాయి. వాటిని చాలామంది బయటపెట్టరు కానీ కొన్ని సందర్భాలలో బయట పెడుతుంటారు. అలా ఓ స్టార్ డైరెక్టర్ కూడా తాను గతంలో ఎదురుకున్న ఒక చేదు అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరంటే..
ప్రతి వారం ఈటీవీలో ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షోను బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఇందులో ఎంతో మంది అలనాటి నటులను, దర్శక నిర్మాతలను ఆహ్వానించి వాళ్ల గురించి అడిగి తెలుసుకుంటాడు ఆలీ. పైగా ఇందులో తమ అభిమాన సెలబ్రిటీలు వస్తే చాలు వాళ్ల గురించి వాళ్ల నోటి ద్వారా తెలుసుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే తాజాగా వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.
ఇక అందులో స్టార్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈయన తెలుగులో ఎన్నో కామెడీ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ప్రేమకథా చిత్రాలను కూడా చేసి స్టార్ డైరెక్టర్ గా నిలిచాడు. ఈయన కె.ఎస్.ఆర్.దాస్, దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఆలీతో సరదాగా షోలో పాల్గొని కొన్ని విషయాలను పంచుకున్నాడు.
ఈయన రాజేంద్ర ప్రసాద్ తో దాదాపు 32 సినిమాలను చేశాడట. ఆలీ ఆయనను సరదాగా కొన్ని ప్రశ్నలు అడుగుతూ తెగ నవ్వించాడు. అంతేకాకుండా తను, కోడి రామకృష్ణ చిన్ననాటి స్నేహితులమని తెలిపాడు. ఈయన చెన్నైలో ఉన్నప్పుడు విజిల్స్ వేస్తే రౌడీలు వచ్చారట. ఇక ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలో.. సినిమాలలో పవిత్రంగా చూసుకునే క్లాప్ బోర్డును నేల మీద పెట్టి ఏదో రాస్తున్నాడట. ఆ సమయంలో తన గురువు గారు వచ్చి తనను గట్టిగా కొట్టాడట. మళ్లీ ఎప్పుడు నా కళ్లెదురుగా ఇటువంటి తప్పు చెయ్యొద్దు అని గట్టిగా వాదించాడట. ఇక ఓ సినిమా మధ్యలో నుండి కొన్ని కారణాల వల్ల మధ్యలో నుంచి వెళ్ళిపోయాడట. తన గురువైన దాసరి నారాయణ దగ్గర మళ్లీ చేయనని ఆయన పాదాలకు నమస్కారం పెట్టి వెళ్ళాడట. అలా కొన్ని విషయాలు పంచుకున్న రేలంగి మాటలు ఈ ప్రోమోలో బాగా ఆకట్టుకున్నాయి.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.