సీనియర్ నటి రేఖ బంగ్లాను సీజ్ చేసిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు..

ఒకప్పటి హీరోయిన్ రేఖ ఇంటిని బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు సీజ ్ చేసారు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: July 13, 2020, 9:29 AM IST
సీనియర్ నటి రేఖ బంగ్లాను సీజ్ చేసిన ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు..
సీనియర్ నటి రేఖ (File/Photo)
  • Share this:
ఒకప్పటి హీరోయిన్ రేఖ ఇంటిని బృహన్ ముంబై కార్పోరేషన్ అధికారులు సీజ ్ చేసారు. వివరాల్లోకి వెళితే..  ప్రస్తుతం కరోనా అందరినీ భయపెడుతోంది. ఇప్పటి వరకు చిన్న చిన్న నటులు దీని బారిన పడ్డారు. కానీ ఈ సారి ఏకంగా అమితాబ్ బచ్చన్ దీని బారిన పడ్డాడు. ఈయన ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు.తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే ట్వీట్ చేసాడు. తనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారని చెప్పారు అమితాబ్. ఈయన మాత్రం ముంబై నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్యర్యారాయ్.. మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడటంతో ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివస్తున్న జల్సాను ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు శానిటైజేషన్ చేయడంతో పాటు అమితాబ్ ఉంటున్న ఇంటిని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. తాజాగా ఒకప్పటి నటి రేఖ ఇంటిని కూడా సీజ్ చేసారు బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు. ఆమె ఇంటికి కాపాలా కాసే సెక్యురిటీ గార్డుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో .. ముంబై మున్సిపల్ అధికారులు...రేఖ ఇంటి ప్రాంతాన్ని సీజ్ చేయడంతో పాటు ఆ ఏరియాను పూర్తిగా శానిటైజేషన్ చేసారు. దీంతో రేఖతో పాటు ఆమె ఇంటి సభ్యులు హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఇప్పటికే ఆమీర్ ఖాన్, కరణ్ జోహార్, బోనీ కపూర్ ఇంట్లో పనిచేసే వ్యక్తులకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. వీళ్లందరు ఇపుడు కరోనా నుంచి కోలుకున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 9:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading