చిరంజీవి చేసిన పనికి షాక్ తిన్న సీనియర్ హీరోయిన్..

అవును మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి సీనియర్ నటిమణి షాక్ గురైయింది.తాజాగా చిరు చేసిన పనికి సీనియర్ నటి ఆశ్యర్యం వ్యక్తం చేసింది.

news18-telugu
Updated: November 18, 2019, 4:34 PM IST
చిరంజీవి చేసిన పనికి షాక్ తిన్న సీనియర్ హీరోయిన్..
చిరంజీవి (File Photo)
  • Share this:
అవును మెగాస్టార్ చిరంజీవి చేసిన పనికి సీనియర్ నటిమణి షాక్ గురైయింది.తాజాగా నాగార్జున.. తన తండ్రి దివంగత ఏఎన్నార్ పేరు మీదుగా అక్కినేని అవార్డు ఇస్తున్న సంగతి తెలిసిందే కదా.  రెండు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను ప్రముఖ నటి రేఖతో పాటు దివంగత శ్రీదేవికి ప్రకటించారు. ఆ అవార్డు ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి మైకు అందుకొని... ఈ అవార్డు గొప్పతనంతో పాటు ఆయన  చేసిన సుధీర్ఘ ఉపన్యాసం విని.. సీనియర్ నటి రేఖతో పాటు నాగార్జున స్జేజ్‌పై ఉన్న మిగతా వాళ్లందరు ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేసారు.  ఈ అవార్డు ఫంక్షన్‌లో ఏఎన్నాఆర్ గొప్పదనం చెప్పడం వరకు  బాగానే ఉన్నా.. ఆ తర్వాత చిరంజీవి ఇండస్ట్రీ గురించి తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడాన్ని కాస్త అతిగా ఉందని అక్కడున్నజనాలు  చెప్పుకున్నారట. దాసరి తర్వాత  ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తున్న చిరంజీవి.. ఇలా చేతికి మైకు రాగానే అదే పనిగా మాట్లాడటం చూసి మిగతా వాళ్లు కాస్త ఇబ్బంది పడుతున్నారట. దీంతో చిరంజీవిని ఏదైనా ఫంక్షన్‌కు పెద్దగా పిలవాలన్న విషయంలో ఇండస్ట్రీల జనాలు  భయపడుతున్నారు. ఇక నుంచైనా..చిరంజీవి తాను చెప్పదలుచుకుంది సూటిగా సుత్తిగా లేకుండా చెబితే బాగుంటుందని అందరు చెవులు కొరుక్కుంటున్నారు.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు