Regina Cassandra : మెగాస్టార్ కోసమే ఆ పాట చేశా...

Regina Cassandra : రెజీనా ఆమధ్య అడివి శేష్ హీరోగా వచ్చిన 'ఎవరు'లో నటించి అదరగొట్టిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: March 10, 2020, 7:59 AM IST
Regina Cassandra : మెగాస్టార్ కోసమే ఆ పాట చేశా...
రెజీనా Photo : Twitter
  • Share this:
Regina Cassandra : రెజీనా కాసాండ్రా.. 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వే లేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇటు తెలుగు సినిమాల్లో నటిస్తూనే.. అటూ తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ప్రవేశించింది. తాజాగా ఈ భామ తెలుగులో నటించిన 'ఎవరు' ఆ మధ్య విడుదలై.. హిట్ టాక్‌ను తెచ్చుకుంది. కాగా ఈ భామ చిరంజీవి 152వ చిత్రం 'ఆచార్య'లో ఓ పాటలో అదరగొట్టిందట. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఆచార్యకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇలాంటి స్పెషల్ సాంగ్‌లో ఎప్పుడూ నటించని రెజీనా ఈ చిత్రంలో మొదటిసారి నటించింది. ఈ సందర్భంగా రెజీనా మాట్లాడుతూ, తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... ఇక చిరంజీవిగారితో డ్యాన్స్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎలా వదులుకుంటానని చెప్పింది. ఈ సినిమాలో చిరంజీవిగారు నటిస్తున్నారు కాబట్టే అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా 'ఓకే' చెప్పానని చెప్పింది రెజీనా.

Regina Cassandra song in Chiranjeevi Acharya,regina cassandra,regina cassandra movies,regina cassandra movies in hindi dubbed,regina cassandra speech,regina cassandra interview,regina,regina cassandra songs,regina cassandra awards,regina songs,regina movies,jfw regina cassandra,regina cassandra age,regina cassandra bio,regina cassandra more,ragina cassandra,regina cassandra debut,bio of regina cassandra,Regina song in Acharya,రెజీనా, ఆచార్య,రెజీనా సాంగ్,
చిరంజీవి, రెజీనా Photo : Twitter


ఈ స్పెషల్ సాంగ్‌ను ఆరు రోజుల పాటు చిత్రీకరించారని... ఆపాటలో చిరంజీవిగారి డ్యాన్స్ తనలో స్ఫూర్తిని నింపిందని ఈ సందర్బంగా తెలిపింది రెజీనా. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ఈ పాటలో తన డ్యాన్స్ ను చిరంజీవిగారు మెచ్చుకున్నారని... ఆయన నుంచి అభినందనలు రావడం చాలా సంతోషాన్ని కలిగించిందని రెజీనా పేర్కోంది. ఆచార్య సినిమాలో చేసింది ఐటెమ్ సాంగ్ కాదంటూ దాన్ని అని పిలవొద్దని, సెలబ్రేషన్ సాంగ్ అనాలని కోరింది. ఇక ఇలాంటి స్పెషల్ సాంగ్‌లో మరోసారి నటించనని.. ఇదే చివరిసారి కూడా అని పేర్కోంది. రెజీనా ప్రస్తుతం రెండు తమిళ సినిమాల్లో నటిస్తోంది.
First published: March 10, 2020, 7:39 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading