Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: June 29, 2020, 5:26 PM IST
రెజీనా కసాండ్రా (Image: Regina Cassandra/Facebook)
ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశ్యం లేదా అంటే అవును లేదనే చెప్తుంది రెజీనా కసాండ్రా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముద్దులే కాదు హగ్గులకు కూడా నో చెప్పాల్సిందే. అందుకే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. అసలే బయట కరోనా వైరస్ ప్రాణాలు తీస్తుంది. దాంతో బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు జనం. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా షూటింగ్స్ అంటే అంతకంటే సాహసం మరోటి ఉండదేమో..? అందుకే మన హీరో హీరోయిన్లు కూడా కరోనా తగ్గిన తర్వాతే షూటింగ్స్ చేసుకుందామని తీరిగ్గా చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రెజీనా కూడా చాలా కండీషన్స్ పెడుతుంది.

రెజీనా కసాండ్రా (Image: Regina Cassandra/Facebook)
ప్రస్తుతం ఈ భామకు ఇమేజ్ అయితే లేదు. హీరోయిన్గా చేసిన సినిమాలు పెద్దగా కలిసిరాకపోవడంతో ఇప్పుడు విలన్‌గా బిజీ అయిపోయింది రెజీనా. ఇప్పటికే ఎవరు, 7 లాంటి సినిమాల్లో లేడీ విలన్ పాత్రలు చేసింది రెజీనా. దానికి తోడు ఎవరులో రొమాన్స్ కూడా పీక్స్‌కు చేరిపోయింది. అందులో నవీన్ చంద్రతో కలిసి బెడ్రూమ్ సీన్స్‌తో పాటు లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేసింది.

రెజీనా కసాండ్రా (Image: Regina Cassandra/Facebook)
అయితే ఇప్పుడు మాత్రం అలాంటి సీన్స్ చేయడానికి తాను సిద్ధంగా లేనని చెప్పింది రెజీనా. హగ్గింగ్, కిస్సింగ్ సీన్స్ చేయాలంటే భయం వేస్తుందని.. ప్రాణాంతక వైరస్ ఉన్నపుడు ఇలాంటివి తగవని దర్శక నిర్మాతలకు తాను చెప్పినట్లుగా ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రెజీనా. ప్రస్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న చక్ర సినిమాలో ప్రతినాయక పాత్రలో నటిస్తుంది రెజీనా.
First published:
June 29, 2020, 5:25 PM IST