మెగాస్టార్ చిరంజీవిని దిమ్మదిరిగేలా చేసిన హీరోయిన్..

మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎలాంటి మొహమాటం లేకుండా ఓకే చెబుతారు. తాజాగా చిరంజీవితో కలిసి పాట పాడే అవకాశాన్ని రెజీనా ఒదులుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: January 3, 2020, 8:00 AM IST
మెగాస్టార్ చిరంజీవిని దిమ్మదిరిగేలా చేసిన హీరోయిన్..
చిరంజీవి (Twitter/photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశం వస్తే ఎవరైనా ఎలాంటి మొహమాటం లేకుండా ఓకే చెబుతారు. అంతేకాదు చిరు సినిమాలో చిన్నపాత్రైనా చాలని అంటుంటారు. తాజాగా చిరంజీవితో కలిసి పాట పాడే అవకాశాన్ని రెజీనా ఒదులుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తున్నట్టు ప్రచారం జరగుతోంది. ఈ చిత్రంలో రెజీనాను ఐటెం సాంగ్ కోసం సంప్రదించారట కొరటాల శివ. ఐతే.. ప్రస్తుతం హీరోయిన్‌గా నటిస్తూనే ‘ఎవరు’ వంటి సినిమాల్లో నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్న రెజీనా.. ఇప్పట్లో ఐటెం సాంగ్ వంటివి చేస్తే కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందని చిరంజీవి సినిమాకు సున్నితంగా నో చెప్పిందట.

regina will do item song for chiranjeevi koratala siva movie,chiranjeevi,chiranjeevi movies,chiranjeevi koratala siva,chiranjeevi koratala siva different concept,vijayashanti,vijayashanti mahesh babu sarileru neekevvaru,vijayashanti movies,chiranjeevi vijayashanti,chiranjeevi vijayashanti hit pair,chiranjeevi vijayashanti again pair in koratala siva movie,chiranjeevi twitter,chiranjeevi instagram,chiranjeevi facebook,chiranjeevi,vijayashanti,vijayashanti movies,vijayashanti facebook,vijayashanti twitter,vijayashanti instagram,chiranjeevi hit movies,manchi donga songs,chiranjeevi movies parts,telugu movies,chiranjeevi birthday special,chiranjeevi full movies,chiranjeevi hit songs,chiranjeevi comedy scenes,vijayashanti movies parts,chiranjeevi and vijayashanti,chiranjeevi vijayashanthi movies,chiranjeevi vijayashanthi hit songs,chiranjeevi & vijayashanti love parts,telugu full movies,tollywood,telugu cinema,చిరంజీవి,విజయశాంతి,చిరంజీవి విజయశాంతి,మరోసారి జోడి కట్టబోతున్న చిరంజీవి,విజయశాంతి,కొరటాల శివ సినిమాలో విజయశాంతి చిరంజీవి,చిరంజీవికి జోడిగా విజయశాంతి,విజయశాంతి,విజయశాంతి సరిలేరు నీకెవ్వరు,డిఫరెంట్ కాన్పెప్ట్‌తో చిరంజీవి కొరటాల శివ
చిరంజీవి,రెజీనా (File/Photos)


చిరంజీవి, కొరటాల శివ సినిమా విషయానికొస్తే..ఈ చిత్రాన్ని దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు జోరుగా ప్రచారం నడుస్తోంది. దేవాలయాలను నిర్లక్ష్యం చేయడం వలన  సమాజంపై ఎంత చెడు ప్రభావం చూపుతాయనేది ఈ సినిమా కాన్సెప్ట్. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఆలయ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వారిపై హీరో ఎలాంటి ఉక్కుపాదం మోపాడు. దేవాలయ ఆస్తులను కాపాడడానికి హీరో ఏం చేసాడు. ప్రభుత్వానికి ఎలాంటి సందేశం ఇచ్చాడనేదే ఈ సినిమా కాన్సెప్ట్ అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ‘గోవిందాచార్య’ మరియు ‘గోవిందా హరి గోవిందా’ ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 3, 2020, 8:00 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading