Regina Cassandra: పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన రెజీనా..

Regina Cassandra: కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా కొన్ని రోజుల..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: July 24, 2020, 3:41 PM IST
Regina Cassandra: పెళ్లిపై పూర్తి క్లారిటీ ఇచ్చిన రెజీనా..
రెజీనా (Regina/Instagram)
  • Share this:
కొన్ని రోజుల కింద చాలా సైలెంట్‌గా రెజీనా నిశ్చితార్థం పూర్తైపోయింది.. ఇండ‌స్ట్రీలో కొన్ని రోజులుగా జ‌రుగుతున్న ప్ర‌చారం ఇది. దీనిపై రెజీనా కూడా కొన్ని రోజుల వ‌ర‌కు ఎలాంటి స్పంద‌న ఇవ్వ‌క‌పోవ‌డం.. సోష‌ల్ మీడియాలో ఇత‌డే రెజీనాకు కాబోయే భ‌ర్త అంటూ ఫోటోలు రావ‌డంతో అంతా ఇది నిజ‌మే అని ఫిక్సైపోయారు. పైగా వ‌ర‌స ఫ్లాపుల‌తో రెజీనా కెరీర్ దారుణ‌మైన ప‌రిస్థితుల్లో ప‌డిపోయింది. ఒక్కటంటే ఒక్క హిట్ అంటూ ఇప్పుడు వేచి చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. ఈ మ‌ధ్యే విలన్‌గా నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.

రెజీనా (Regina/Instagram)
రెజీనా (Regina/Instagram)


ఎవరు సినిమాతో పాటు సెవెన్ సినిమాలో కూడా పూర్తిగా నెగిటివ్ రోల్ చేసింది రెజీనా. ఇందులో ఎవరు హిట్ అయినా కూడా ఈమెకు కలిసొచ్చింది అయితే ఏం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఇక పెళ్లొక్క‌టే శ‌ర‌ణ్య‌మ‌ని.. ఆ వైపుగానే రెజీనా అడుగేస్తుందనే వార్త‌లు వ‌చ్చాయి. గతేడాది ఈమె నిశ్చితార్థం జ‌రిగిపోయింద‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ వార్త‌ల‌పై అప్పట్లో రెజీనా స్వ‌యంగా స్పందించింది. తన పెళ్లిపై కొన్ని రోజులుగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ అవాస్తవం అని కొట్టిపారేసింది రెజీనా క‌సెండ్రా. అస‌లు ఇలాంటి న్యూస్ ఎందుకు ఎవ‌రు దేనికోసం రాస్తారో అర్థం కావ‌డం లేద‌ని చెబుతుంది ఈ ముద్దుగుమ్మ‌.
రెజీనా (Regina/Instagram)
రెజీనా (Regina/Instagram)

ఇంత సెన్సిటివ్ విష‌యాలు రాసేట‌ప్పుడు క‌నీసం అడ‌గాలి క‌దా.. నిజానిజాలు తెలుసుకోవాలి క‌దా అంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేసింది రెజీనా. ఒక‌వేళ నిజంగానే త‌న‌కు పెళ్లి చేసుకోవాల‌నిపిస్తే క‌చ్చితంగా అంద‌రికీ చెప్పే చేసుకుంటాన‌ని.. తానే స్వయంగా అన్ని వివ‌రాలు ప్రకటిస్తానని చెప్పింది ఈ భామ‌. మొత్తానికి ఈమె క్లారిటీ ఇవ్వ‌డంతో రెజీనా పెళ్లికి ఫుల్ స్టాప్ ప‌డిపోయిన‌ట్లే ఇప్పుడు. ప్ర‌స్తుతం విశాల్ హీరోగా నటిస్తున్న చక్ర సినిమాతో బిజీగా ఉంది రెజీనా కసాండ్రా.
Published by: Praveen Kumar Vadla
First published: July 24, 2020, 2:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading