హోమ్ /వార్తలు /సినిమా /

Regina Cassandra : శూర్పణఖగా అందాల రెజీనా.. అనుకున్నది సాధిస్తుందా..

Regina Cassandra : శూర్పణఖగా అందాల రెజీనా.. అనుకున్నది సాధిస్తుందా..

రెజీనా Photo : Instagram

రెజీనా Photo : Instagram

Regina Cassandra : రెజీనా కాసాండ్రా.. 'శివ మనసులో శృతి' సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన..ఆ తర్వాత వచ్చిన 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాతో మంచి హిట్ కొట్టి.. తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇంకా చదవండి ...

రెజీనా కాసాండ్రా.. తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన 'శివ మనసులో శృతి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోయిన ఆ తర్వాత వచ్చిన సందీప్ కిషన్ 'రోటీన్ లవ్ స్టోరీ' సినిమాలో నటించి మంచి విజయం సాధించింది. ఇక ఆ తర్వాత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి తేజ్‌తో పిల్లా నువ్వే లేని జీవితం, 'సుబ్రమణ్యం ఫర్ సేల్' లాంటీ సినిమాల్లో నటించి వరుసగా విజయాలను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత ఈ భామ నటించిన కొన్ని సినిమాలు పెద్దగా అలరించకపోవడంతో తెలుగులోఅవకాశాలు తగ్గాయి. ఇక ఆ మధ్య అడివి శేష్ ప్రధాన పాత్రలో వచ్చిన ఎవరు సినిమాలో బోల్డ్ పాత్రలో కేకపెట్టించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మళ్లి తెలుగులో అవకాశాలు వస్తున్నాయి రెజీనాకు. అందులో భాగంగా రెజీనా ఆచార్యలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్‌లో కూడా నటిస్తోన్న అక్కడ శూర్పణఖ పేరుతో ఓ సినిమాలో నటిస్తోంది.


హారర్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు రెజీనా తమిళ్‌లో మరో మూడు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. విశాల్ ఛక్రతో పాటు కల్లాపార్ట్, కసదతపర మొదలగు తమిళ సినిమాల్లో నటిస్తోంది.ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ఈ భామకు అవకాశాలు లేవనే చెప్పోచ్చు. దీనికి కారణం కూడా ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన కాప్ యాక్షన్ ఫిల్మ్ నక్షత్రం, ఆ తర్వాత నారా రోహిత్ హీరోగా వచ్చిన బాలకృష్ణుడు, ఆ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించకపోవడంతో తెలుగులో అవకాశాలు కనుమరుగు అయ్యాయి. సెవెన్, ఎవరు సినిమాల్లో నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించిన రెజీనాకు ఆ సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఆచార్య సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్న రెజీనాకు తెలుగులో పూర్వ వైభవం రావావలనీ కోరుకుంటున్నారు ఆమె అభిమానులు.

First published:

Tags: Regina Cassandra

ఉత్తమ కథలు