ఇంట్లోనే షూటింగ్.. మొబైల్స్‌తోనే సినిమా.. కరోనా వైరస్‌పై కొత్త ప్రయోగం..

Red Zone: తెలుగు సినిమా రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుందంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ సినిమాను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఓవైపు కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 28, 2020, 10:24 PM IST
ఇంట్లోనే షూటింగ్.. మొబైల్స్‌తోనే సినిమా.. కరోనా వైరస్‌పై కొత్త ప్రయోగం..
కరోనా వైరస్‌పై మొబైల్స్‌తో చేసిన సినిమా రెడ్ జోన్ (Red Zone)
  • Share this:
తెలుగు సినిమా రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతుందంటే ఏమో అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ సినిమాను చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఓవైపు కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమయంలో మరోవైపు భవిష్యత్తు ప్రణాళిక ఎలా అని సందిగ్ధంలో ఉన్నారు సినీ పెద్దలు. రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు సహకారం అందిస్తామని అభయం ఇచ్చినా మునుపటి లాగా షూటింగులు అవుతాయో లేదో.. అయితే ఎప్పటికి గత వైభవం వస్తుందో తెలియని అయోమయం. ఇలాంటి వాతావరణంలో దర్శకుడు శేషు కెఏంఆర్ త్వరలో ఒక సినిమా విడుదల చెయ్యబోతున్నాడు. దాని పేరు 'రెడ్ జోన్'.


ఈ సినిమా మీద ఎందుకింత ఆసక్తి అంటే ఇక్కడే ఉంది అసలు కథ. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ లేడు.. దర్శకుడు దర్శకత్వం చెయ్యలేదు, కాస్ట్ అండ్ క్రూ ఒకరితో ఒకరు కలిసి పని చెయ్యలేదు. ప్రతి నటుడు, నటి తమ ఇళ్లలో ఉంటూ తమ మొబైల్ ఫోన్ సహాయంతో సెల్ఫీ మోడ్‌లో డైలాగ్స్ చెప్పి వాటిని సింక్ సౌండ్‌లో రికార్డు చేసి ఏకంగా ఒక కథనే సృష్టించారు. మరొక విశేషం ఏంటంటే దీనికి పాట ముంబయి, పూణే గౌరవ్ ప్రథం అనే యువకులు సమకూర్చి తమ ఊళ్ళోనే తయారు చేసారు. అదే విథంగా ఎడిటింగ్, సౌండ్, మిక్సింగ్ మిగతా పనులు చెన్నై, హైదరాబాద్ నగరాలలో జరిగాయి.

మొత్తమ్మీద కరోనా విధించిన లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించకుండా ఇలాంటి కష్ట కాలంలో కూడా సంకల్పం చేసుకుంటే ఒక సినిమానే తయారు చేయొచ్చని శేషు నిరూపించాడు. ఈ విషయం తెలిసిన సినీ వర్గాలు 'రెడ్ జోన్' కరోనా కి సరైన జవాబు అని కితాబు ఇస్తున్నారు. దక్కన్ భాషలో సిద్ధమైన 'రెడ్ జోన్' లో అజిజ్ నాసర్, బిగ్ బాస్ ఫేమ్ అలీ రెజా, సూఫీ ఖాన్, ఆర్ కే మామా, శివ మామిడి తదితరులు నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మే చివర్లో డిజిటల్లో సినిమా విడుదల కానుంది. ఇలాంటి తరుణంలో కూడా కొత్త ఆలోచనతో వస్తున్న రెడ్ జోన్ ఎందరితో స్పూర్తి కలిగిస్తుందని చిత్రయూనిట్ చెప్తున్నారు.
First published: May 28, 2020, 10:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading