• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RED HEROINE MALAVIKA SHARMA PRAISES SAI PALLAVI AND RAM POTHENENI MNJ

Sai Pallavi- Malavika Shama: సాయి ప‌ల్ల‌వి గట్స్ ఎవ‌రికీ ఉండ‌వేమో.. ఫిదా బ్యూటీపై రెడ్ హీరోయిన్ మాల‌విక ప్ర‌శంస‌లు

Sai Pallavi- Malavika Shama: సాయి ప‌ల్ల‌వి గట్స్ ఎవ‌రికీ ఉండ‌వేమో.. ఫిదా బ్యూటీపై రెడ్ హీరోయిన్ మాల‌విక ప్ర‌శంస‌లు

సాయి పల్లవి మాలవిక శర్మ

అందం, అభిన‌యం రెండూ కలిసి ఉన్న హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వి(Sai Pallavi) ముందు వ‌రుస‌లో ఉంటారు. అంతేకాదు ఈ హీరోయిన్ మేక‌ప్ లేకుండా న‌టించేందుకు ఇష్ట‌ప‌డుతుంది. దీంతో మిగిలిన హీరోయిన్ల కంటే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ ఫిదా బ్యూటీ. కాగా ఈ స‌హ‌జ న‌టిపై తాజాగా ప్ర‌శంస‌లు కురిపించారు రెడ్(Red) హీరోయిన్ మాల‌విక‌(Malavika Sharma)

  • Share this:
    Sai Pallavi- Malavika Shama: అందం, అభిన‌యం రెండూ కలిసి ఉన్న హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వి ముందు వ‌రుస‌లో ఉంటారు. అంతేకాదు ఈ హీరోయిన్ మేక‌ప్ లేకుండా న‌టించేందుకు ఇష్ట‌ప‌డుతుంది. దీంతో మిగిలిన హీరోయిన్ల కంటే ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ ఫిదా బ్యూటీ. కాగా ఈ స‌హ‌జ న‌టిపై తాజాగా ప్ర‌శంస‌లు కురిపించారు రెడ్ హీరోయిన్ మాల‌విక‌. సాయిప‌ల్ల‌వి గ‌ట్స్ ఎవ్వ‌రికీ ఉండ‌వేమోన‌ని అన్నారు. రెడ్ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న మాల‌విక‌కు హీరోయిన్ల‌లో ఇష్ట‌మైన వారు ఎవ‌రి అని అడ‌గ్గా.. స‌మంత, సాయి ప‌ల్ల‌వి పేర్లు చెప్పింది. స‌మంత యాక్టింగ్ బావుంటుంద‌ని కితాబిచ్చింది.

    ఇక సాయి ప‌ల్ల‌వి అంటే చాలా ఇష్ట‌మ‌ని.. త‌ను మేక‌ప్ లేకుండా చాలా స‌హ‌జంగా న‌టిస్తుంద‌ని ప్ర‌శంసించారు. త‌న స్కిన్‌తో చాలా కంఫ‌ర్ట్‌గా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌గ‌ల‌ద‌ని.. అలాంటి గ‌ట్స్ ఏ హీరోయిన్‌కి అంత ఈజీగా రావేమోన‌ని మాల‌విక అన్నారు. ఇక హీరోల గురించి మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌కి తాను పెద్ద అభిమానిన‌ని అన్నారు. ఇక రామ్ చాలా టాలెంటెడ్ ప‌ర్స‌న్ అని.. తాను మూడు సంవ‌త్స‌రాలు లా చ‌దివినా.. త‌న‌కు తెలియ‌ని ఎన్నో చ‌ట్టాల గురించి రామ్‌కి తెలుస‌ని కితాబిచ్చారు.

    కాగా త‌మిళంలో విజ‌యం సాధించిన‌ తాడం రీమేక్‌గా రెడ్ మూవీ తెర‌కెక్కింది. ఇందులో రామ్ ద్విపాత్రాభిన‌యంలో న‌టించ‌గా.. ఆయ‌న స‌ర‌స‌న మాల‌విక‌, నివేథా పేతురాజ్, అమృతా అయ్య‌ర్ న‌టించారు. కిశోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన ఈ చిత్రానికి మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. ఈ మూవీ గురువారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే హ‌లో గురు ప్రేమ‌కోస‌మే, ఇస్మార్ట్ శంక‌ర్‌తో వ‌రుస‌గా రెండు హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న రామ్.. రెడ్‌తో హ్యాట్రిక్ సొంతం చేసుకుంటాన‌న్న ధీమాలో ఉన్నాడు.
    Published by:Manjula S
    First published: