Rebel Star Prabhas: విధాత ప్రొడక్షన్స్ పై ఫిల్మ్ స్టార్స్ మేకర్ సత్యానంద్ గారి సమర్పణ లో రొటీన్ చిత్రాలకు భిన్నంగా బిందు అనే ఒక నాయి బ్రమ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధను ఆధారంగా చేసుకుని ఒక మెసేజ్ ఓరియంటెడ్ చిత్రంలా కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి చక్కగా తెరకెక్కించిన చిత్రం "సాచి". ఈ చిత్రాన్ని ఉపేన్ నడిపల్లి మరియు వివేక్ పోతగోని నిర్మాణ సారధ్యములో వివేక్ పోతగోని దర్శకుడిగా రూపొందించారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు.అనంతరం రెబెల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ "సాచి ట్రైలర్ చూసాను. చాలా బాగుంది. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. ఈ చిత్రాన్ని సత్యానంద్ గారు సమర్పించగా వివేక్ పోతగోని నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలి.
దర్శక నిర్మాత వివేక్ పోతగోని మాట్లాడుతూ "సాచి నిజజీవిత కథ. బిందు అనే ఒక నాయి బ్రామ్మిన్ అమ్మాయి నిజ జీవిత గాధ. మహిళా సాధికారత కు సంభందించిన చిత్రం ఇది. మా చిత్ర ట్రైలర్ ను హీరో ప్రభాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. ఈమధ్యనే సాచి చిత్రాన్ని పలువురు ప్రముఖులకు ప్రివ్యూ వేసాము. తెలంగాణ నాయీ బ్రమ్మిన అధ్యక్షుడు పాల్వాయి శ్రీనివాస్ గారు మా చిత్రాన్ని చూసి హర్షం వ్యక్తం చేసారు. మా చిత్రం మార్చి 3న విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం అందరికి నచ్చుతుందున్నారు.
Rebel star #Prabhas launched the trailer of #Saachi & conveyed his best wishes to the entire team Trailer►https://t.co/fNlJ0jrBy2 Music by #KVBharadwaj #SanjanaReddy #GeethikaRathan #AshokMulavirat #UpenNadipalli #Satyanand @vivekpothagoni @adityamusic pic.twitter.com/F0S0uVQq0q
— Aditya Music (@adityamusic) February 22, 2023
ఈ చిత్రములో సంజన రెడ్డి, గీతిక రధన్ హీరోయిన్స్ గా నటించగా, చెల్లి స్వప్న, అశోక రెడ్డి మూలవిరాట్, టివి రామన్, ఏవిఎస్ ప్రదీప్, తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. KV భరద్వాజ్ సంగీత దర్శకునిగా, ప్రసన్న కుమార్ పాటలు, పెద్దింటి అశోక్ కుమార్, వివేక్ పోతగోని మాటలు అందించారు. ఈ చిత్రానికి కథ,మాటలు, స్క్రీన్ ప్లే, ఫోటోగ్రఫీ, మరియు దర్శకత్వ బాధ్యతలను వివేక్ పోతగోని వహించారు.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఈ యేడాది ఈయన హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా జూన్ 16న విడుదల కానుంది. మరోవైపు ‘సలార్’ ఈ యేడాది 28 సెప్టెంబర్‌న విడుదల కానుంది. ఇక ప్రాజెక్ట్ K చిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక మారుతితో చేస్తోన్న ‘రాజా డీలక్స్’ సినిమా వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడదల చేసే ప్లాన్‌లో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.