• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • REBEL STAR PRABHAS TO MARRY SOFTWARE COMPANY OWNER DAUGHTER WHO SETTELED IN AMERICA MNJ

Prabhas Marriage: మ‌ళ్లీ తెర‌పైకి ప్ర‌భాస్ పెళ్లి.. త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌బోతున్న రెబ‌ల్ స్టార్

Prabhas Marriage: మ‌ళ్లీ తెర‌పైకి ప్ర‌భాస్ పెళ్లి.. త్వ‌ర‌లోనే పెళ్లిపీట‌లెక్క‌బోతున్న రెబ‌ల్ స్టార్

Here is an interesting link between Prabhas, SS Rajamouli and Prashanth Neel full details here

Prabhas Marriage: టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ లిస్ట్‌లో బాహుబ‌లి ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. 41 ఏళ్ల ఈ హీరో ఇంకా పెళ్లి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు ట్రీట్లు ఇస్తున్నాడు కానీ పెళ్లి అంటే మాత్రం నోరు విప్ప‌డం లేదు. ఇప్ప‌టికే పెళ్లి వ‌య‌సు దాటిపోయి చాలా కాల‌మే అవ్వ‌డంతో ప్ర‌భాస్ టాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్‌ల మార‌డు క‌దా అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు

  • Share this:
    Prabhas Marriage: టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచుల‌ర్ లిస్ట్‌లో బాహుబ‌లి ప్ర‌భాస్ ముందు వ‌రుస‌లో ఉన్నాడు. 41 ఏళ్ల ఈ హీరో ఇంకా పెళ్లి గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. వరుస సినిమాలు చేస్తూ అభిమానులకు ట్రీట్లు ఇస్తున్నాడు కానీ పెళ్లి అంటే మాత్రం నోరు విప్ప‌డం లేదు. ఇప్ప‌టికే పెళ్లి వ‌య‌సు దాటిపోయి చాలా కాల‌మే అవ్వ‌డంతో ప్ర‌భాస్ టాలీవుడ్ స‌ల్మాన్ ఖాన్‌ల మార‌డు క‌దా అని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మ‌రోవైపు త‌మ అభిమాన న‌టుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుంటాడా..? ఎవ‌రిని పెళ్లి చేసుకుంటాడా..? అన్న ఫ్యాన్స్ ఎదురుచూపులు ఆగ‌డం లేదు. ఇంకోవైపు ప్ర‌భాస్ ఎప్పుడు పెళ్లి అని అడిగితే అప్పుడు చేసేందుకు తామంతా రెడీగా ఉన్నామ‌ని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ప్ర‌భాస్ పెళ్లి మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది.

    గ‌తంలోనూ ప‌లుమార్లు ప్ర‌భాస్ పెళ్లి గురించి వార్త‌లు చాలానే వ‌చ్చాయి. సినీ న‌టులు మొద‌లు బిజినెస్‌మ్యాన్ కూతుర్ల వ‌ర‌కు చాలా మంది ప్ర‌భాస్ వివాహం చేసుకోబోయే జాబితాలో నిలిచారు. అయితే అవ‌న్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక తాజా స‌మాచారం ప్రకారం అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఫౌండ‌ర్ కుమార్తెను ప్ర‌భాస్ పెళ్లాడ‌బోతున్నార‌ట‌. ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం.. వీరు కృష్ణంరాజు భార్య బంధువుల‌ని తెలుస్తోంది. కొన్నేళ్లుగా వారు అమెరికాలోనే సెటిల్ అయిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే ఇరు కుటుంబాల మ‌ధ్య మాట‌లు జ‌రుగుతున్నాయ‌ని.. వారంద‌రూ ప్ర‌భాస్ మాట కోసం ఎదురుచూస్తున్నార‌ని టాక్. అంతేకాదు రాధే శ్యామ్ మూవీ విడుద‌ల త‌రువాత వీరి పెళ్లి ఉండ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈసారైనా ప్ర‌భాస్ పెళ్లి వార్త‌లు నిజం అవుతాయేమో చూడాలి.

    కాగా ప్ర‌స్తుతం ప్ర‌భాస్, ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో సలార్‌.. ఓమ్ రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆది పురుష్.. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీలో న‌టించ‌నున్నారు. వీటితో్ పాటు బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.
    Published by:Manjula S
    First published: